మహేశ్ ఎందుకలా అన్నాడో నాకర్ధం కాలేదు.. ఆర్జీవీ - MicTv.in - Telugu News
mictv telugu

మహేశ్ ఎందుకలా అన్నాడో నాకర్ధం కాలేదు.. ఆర్జీవీ

May 12, 2022

ఈరోజు విడుదలైన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్లలో మహేష్ బాబు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. బాలీవుడ్‌ ఎంట్రీపై స్పందిస్తూ.. బాలీవుడ్‌ తనని భరించలేదని.. అందుకే తాను అక్కడికి వెళ్లి టైమ్ వేస్ట్ చేసుకోవాలనుకోవడం లేదని.. టాలీవుడ్‌లో ప్రేక్షకుల అభిమానం పొందడం ఆనందంగా ఉందని మహేష్ అన్నారు. మహేశ్‌ చేసిన కామెంట్స్ బీటౌన్‌ లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు.

మహేశ్ బాబు వ్యాఖ్యల్లోని మర్మమేంటో తనకు అర్థం కాలేదన్నారు. ఒక హీరోగా అది మహేష్ ఎంపిక. కానీ బాలీవుడ్ అతనిని భరించలేనిదన్న అతని ఉద్దేశ్యం ఏమిటో నాకు నిజంగా అర్ధం కాలేదు. బాలీవుడ్ అంటే ఒక కంపెనీ కాదు.. మీడియా ఇచ్చే లేబుల్.. ఒక్కో సినిమా కంపెనీ లేదా ప్రొడక్షన్ హౌస్ లాంటిది. మహేష్ ఏ ఉద్దేశ్యంతో ఆ కామెంట్స్ చేశారో నాకు అర్ధం కాలేదు అని ఆర్జీవీ అన్నారు.