‘చంపేస్తాడు.. బాబు చంపేస్తాడు’...వర్మ పాట విడుదల - MicTv.in - Telugu News
mictv telugu

‘చంపేస్తాడు.. బాబు చంపేస్తాడు’…వర్మ పాట విడుదల

September 24, 2019

సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రాంగోపాల్ వర్మ. తాజాగా తెరకెక్కిస్తున్న ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ సినిమాలోని ‘బాబు చంపేస్తాడు’ పాటను ఈరోజు సాయంత్రం విడుదల చేశారు. ‘మన కళ్ల ముందే జరగుతున్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులను చూస్తుంటే.. నిజమా? కలా? అని సందేహపడుతూ ముక్కు మీద వేలేసుకోక తప్పట్లేదు. రాజకీయ నాయకుల ఆత్మహత్యలు.. అత్యంత ప్రజాదరణతో గెలిచిన ఇప్పటి ముఖ్యమంత్రిని టెర్రరిస్టుతో పోలుస్తున్న అప్పటి ముఖ్యమంత్రి. ఏమిటీ వైపరీత్యం? ఏమిటీ రాష్ట్రం? ఎక్కడికి పోతోంది మన దేశం?… ఈ విపత్కర పరిస్థితులకు కారణం కమ్మ రాజ్యంలోకి కడప రెడ్లు రావడం. ఒక మనిషి అహాన్ని దెబ్బతీస్తే అతను ఎంత ఎక్స్ ట్రీమ్‌కు వెళతాడోనన్న ఆలోచనలో నుంచి వచ్చిందే ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’లోని ఈ పాట. విని ఆనందించకండి’ అని వర్మ ఆ వీడియోలో వ్యాఖ్యానించారు.