సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే .ఆయన సినిమాలు అప్ డేట్స్, ఇంటర్వ్యూలు, ట్వీట్లు ఏది చేసినా సంచలనమే. ఆర్టీవీకి సోషల్ మీడియాలో ఫాలోవర్లు బాగానే ఉన్నారు. ఏ పోస్టు చేసినా క్షణాల్లో వైరల్ అవుతుంది. తనదైన స్టైల్లో ప్రశ్నలు కురిపిస్తుంటారు వర్మ. ఇప్పుడు తాజాగా హైదరాబాద్ లోని అంబర్ పేట కుక్కల దాడిలో చిన్నారి ప్రదీప్ మరణించిన సంగతి తెలిసిందే.
వీధికుక్కల దాడిలో నాలుగేండ్ల చిన్నారి మరణించడం చూసి వర్మ తట్టుకోలేకపోయారు. వెంటనే ట్వీట్ చేశారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీ బాధ్యత తీసుకోవాలని పోరాడుతున్నారు. ఈ ఘటనపై నగర మేయర్ నిర్లక్ష్య కామెంట్స్ కు ఆర్జీవీకి చిర్రెత్తుకొచ్చింది. అంతే పోరాటం షురూ చేశారు. సోషల్ మీడియాలో అందర్నీ ఏకం చేసేందుకు ట్వీట్లు పెడుతున్నారు. తాజాగా కుక్కల మేయర్ అనే టైటిట్ తో ఓ పాటను కూడా రిలీజ్ చేశారు. పాట రూపంలో మేయర్ గద్వాల విజయలక్ష్మీని ఓ రేంజ్ లో కడిగిపారేశారు. ఈ పాటకు తానే స్వయంగా లిరిక్స్ రాసి పాడారు వర్మ. తన ప్రశ్నలంటినీ పాటరూపంలో వినిపించారు. యూట్యూబ్ లో విడుదల చేసిన ఈ పాట నెట్టింట్లో వైరల్ గా మారింది.