జర్నలిస్ట్ అర్ణబ్ గోస్వామి‌పై వర్మ సినిమా..ఫస్ట్ లుక్ వచ్చేసింది - MicTv.in - Telugu News
mictv telugu

జర్నలిస్ట్ అర్ణబ్ గోస్వామి‌పై వర్మ సినిమా..ఫస్ట్ లుక్ వచ్చేసింది

August 13, 2020

Ram Gopal Varma Reveals First Poster of Arnab

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దూకుడు పెంచాడు. వరుసగా సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. థియేటర్లు బంద్ ఉండడంతో ఆర్జీవీ వరల్డ్ అనే వెబ్ సైట్ ఓపెన్ చేసి అందులో తన సినిమాలను విడుదల చేస్తూ పర్ వ్యూ ఇంత అని డబ్బులు వసూల్ చేస్తున్నాడు. ఇప్పటికే ‘క్లైమాక్స్’, ‘నేకేడ్’, ‘పవర్ స్టార్’ వంటి సినిమాలను అందులో విడుదల చేసిన సంగతి తెల్సిందే. ప్రస్తుతం ‘కరోనా’, ‘మర్డర్’, ‘అల్లు’, ‘అర్ణబ్-ది న్యూస్ ప్రాస్టిట్యూట్’, ‘డేంజరస్’ వంటి సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. 

తాజాగా ‘అర్ణబ్’ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను విడుదల చేశాడు. ఈ సినిమాను రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్ణబ్ గోస్వామి పై తీస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా వేశ్య ఇతరుల కోసం తన బట్టలు తీస్తుంది, కాని ఇతను తనని తాను ఆనందం పొందేందుకు ఇతరుల దుస్తులు తీస్తాడంటూ వర్మ ట్వీట్ చేయడం గమనార్హం. అర్ణబ్ గోస్వామి ఇటీవల సుశాంత్ మరణం విషయంలో పలు డిబేట్స్ నిర్వహిస్తున్నాడు. తన డిబేట్స్ లో బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమను విమర్శిస్తున్నాడు. బాలీవుడ్‌కు అండర్ వరల్డ్‌తో సంబంధాలు ఉన్నాయని అన్నారు. బహుశా అందుకే వర్మ.. అర్ణబ్ పై సినిమా తీస్తున్నాడని నెటిజన్లు ఆరోపిస్తున్నారు.