'మెగా ఫ్యామిలీ' సినిమాపై క్లారిటీ ఇచ్చిన వర్మ  - MicTv.in - Telugu News
mictv telugu

‘మెగా ఫ్యామిలీ’ సినిమాపై క్లారిటీ ఇచ్చిన వర్మ 

October 29, 2019

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసందే. ఇటీవల ఈ సినిమాకు సంబందించిన ట్రైలర్‌‌ను విడుదల చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకవైపు ఈ సినిమా వివాదం కొనసాగుతోంటే సోమవారం రోజున వర్మ మరో వివాదాస్పద సినిమాను ప్రకటించారు. 

‘మెగా ఫ్యామిలీ’ అనే టైటిల్‌ను ప్రకటించి ఇదే తన తర్వాతి సినిమా అంటూ ట్వీట్ చేశాడు. దీంతో అందరు వర్మ తరువాత చిరంజీవి కుటుంబాన్ని టార్గెట్ చేసారని అనుకున్నారు. ‘మెగా ఫ్యామిలీ’ సినిమాకు సంబదించిన వివరాలను మంగళవారం ప్రకటిస్తానని ట్వీట్ చేశాడు. ఇదిలా ఉంటే.. మంగళవారం వర్మ మనసు మార్చుకున్నాడు. తాను ‘మెగా ఫ్యామిలీ’ సినిమా చేయడంలేదని ప్రకటించారు. ‘మెగా ఫ్యామిలీ సినిమా కాన్సెప్ట్ ఏంటంటే.. ఓ వ్యక్తికి 39 మంది సంతానం ఉంటారు. చాలా మంది పిల్లలు ఉన్నారు కాబట్టి, నేను చిన్న పిల్లలపై సినిమాలు చేయను కాబట్టి, ఈ సినిమాను చేయకూడదని నిర్ణయించుకున్నాను’ అని ట్వీట్ చేశారు..