బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కొడుకు భగీరథ్ వీడియో వ్యవహారం బాగా వైరల్ అయింది. నిన్నటి నుంచి దీని మీద రచ్చ జరుగుతూనే ఉంది . అయితే ఇప్పుడు ఈ వీడియో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కంట కూడా పడింది. ఇంకేముంది.. ఈ వీడియో మీదే కాకుండా అందులో ఉన్న బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌పై తనదైన స్టైల్లో స్పదించాడు ఆర్జీవీ. మామూలు విషయాలనే చిత్ర విచిత్రంగా ట్రీట్ చేసే ఇతను… బండి భగీరథ్ విషయంలోనూ అదే స్టైల్లో ట్వీటాడు. ఎక్కడి నుంచి ఎక్కడికో ముడిపెడుతూ కాంట్రవర్శీకి తెరలేపాడు.
I thought the days of Iraq dictator #Saddam ‘s like sons #UdayHussein were over and now he is reincarnated as @bandisanjay_bjp ‘s son #bhageerqth who as a son YUCKED his FATHER pic.twitter.com/Btzfc4i8ya
— Ram Gopal Varma (@RGVzoomin) January 17, 2023
ఇరాక్‌ను గడగడలాడించిన నియంత సద్దాం హుస్సేన్‌ను మించిన ఆయన కొడుకు ఉదయ్ హుస్సేన్ నాటి రోజులు అంతరించిపోయాయని భ్రమపడ్డా.. కానీ అతను బండి సంజయ్ కొడుకు భగీరథ్ రూపంలో మళ్ళీ పుట్టాడు. తండ్రిని మించిన తనయుడు అనిపించుకుంటున్నాడు. అంటూ తన స్టైల్లో ఆర్జీవీ ట్వీట్ చేశాడు. ఇందులో బండి సంజయ్ కొడుకును సద్దాం హుస్సేన్ లాంటి నియంత కొడుకుతో పోల్చటం ఓ ఎత్తైతే.. తండ్రిని మించిపోయాడంటూ పాయింట్ అవుట్ చేయడం మరో ఎత్తు.ఈ పోలికలో తండ్రి కొడుకుల బంధం ఒక్కటి తప్పా.. మిగతాదంతా ఏ కోణంలో పోల్చాడన్నది అతనికి మాత్రమే తెలియాలి.
Suggested: పది పాసైతే చాలు…నెలకు రూ.58,650జీతంతో తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాలు..!
అయితే ఎప్పటిలాగే ఆర్జీవీ చేసిన ఈ కామెంట్ కూడా చర్చనీయాంశంగా మారింది. ఆర్జీవీ పెట్టిన పోస్టుకు నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు భగీరథ్ చేసింది తప్పు అని వాదిస్తుంటే, మరికొందరు నిజాలు తెలుసుకుని మాట్లాడాలంటూ హితవు పలుకుతున్నారు. మరోవైపు ఆర్జీవీ చేసిన పోలికపై బీజేపీ సపోర్టర్స్, కార్యకర్తలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
ఇదిలా ఉంటే.. తన కొడుకు వీడియోపై బండి సంజయ్ స్పందించారు. తన కొడుకు తప్పు ఉంటే తానే స్వయంగా పోలీసులకు అప్పగిస్తానంటూ తెలిపారు. పిల్లలు పిల్లలు కొట్టుకుంటారు.. మళ్ళీ కలుకుంటారంటూ దానికెందుకు ఇంత రాద్ధాంతం అంటూ సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వాటికి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి పిల్లల జీవితాలను ఎలా నాశనం చేస్తారంటూ అటు పోలీసుల మీద.. ఇటు ప్రభుత్వం మీద నిప్పులు చెరుగుతున్నారు.
ALSO READ:‘బండి సంజయ్ కొడుక్కి ఇదే పనా?’.. బయటపడ్డ మరో వీడియో
‘నాతో చేతకాక.. నా కొడుకుపై కేసు పెట్టిస్తావా..?’ కేసీఆర్‌పై బండి సంజయ్ ఫైర్
ఉప్పల్ వేదికగా కివీస్‌తో టీమిండియా తొలి వన్డే నేడు