RAM GOPAL VARMA TWEET ON SUPER STAR KRISHNA DEATH
mictv telugu

కృష్ణ చనిపోయారని బాధపడొద్దు :ఆర్జీవీ

November 15, 2022

సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించాడు. కృష్ణ మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులందరూ తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తుంటే… వర్మ మాత్రం బాధ పడాల్సిన అవసరం లేదని ట్వీట్ చేశారు.

‘కృష్ణ గారు చనిపోయారని బాధపడనవసరం లేదు. ఇప్పటికే ఆయన, విజయ నిర్మల గారిని స్వర్గంలో కలుసుకుని ఉంటారు. వాళ్లిద్ద‌రూ కలిసి స్వ‌ర్గంలో పాట‌లు పాడుతూ, నృత్యం చేస్తూ ఆనందంగా గడుపుతుంటారని అనుకుంటున్నా’ అంటూ ట్వీట్ చేశారాయ‌న‌. అంతేకాదు, ట్వీట్‌కు మోసగాళ్లకు మోసగాడు చిత్రంలో కృష్ణ‌, విజ‌య‌నిర్మ‌ల క‌లిసి పాడుతూ, డ్యాన్స్ చేస్తున్న వీడియోను జత చేశాడు.

మంగళవారం తెల్లవారుజామున 4.09 నిమిషాలకు కృష్ణ తుది శ్వాస విడిచారు. ఆదివారం అర్ధరాత్రి గుండె పోటుతోఆస్పత్రిలో చేరిన ఆయన వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ మరణించారు. మొదట గుండెపోటు, తదుపరి మల్టీ ఆర్గాన్‌ ఫెయిల్యూర్‌ వల్ల కృష్ణ చనిపోయినట్లు కాంటినెంటల్‌ ఆస్పత్రి వైద్యులు స్పష్టం చేశారు. ప్రముఖుల సందర్శకోసం నానక్‌రామ్ గూడలోని నివాసాంలో కృష్ణ భౌతికకాయం ఉంచనున్నారు. అనంతరం అభిమానుల సందర్శనార్థం గచ్చిబౌలి స్టేడియానికి కృష్ణ భౌతికకాయం తరలిస్తారు. ఇందుకోసం గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాట్లు చేస్తున్నారు.