అయోధ్యకు రండి.. ప్రధాని మోదీకి ట్రస్ట్ ఆహ్వానం - MicTv.in - Telugu News
mictv telugu

అయోధ్యకు రండి.. ప్రధాని మోదీకి ట్రస్ట్ ఆహ్వానం

July 2, 2020

Ram Janmabhoomi Trust Invites PM Modi to Ayodhya

అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం పనులు వేగంగా సాగుతున్నాయి. ఆలయ పనులు ప్రారంభించేలా ట్రస్ట్ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభించాలని నిర్ణయించిన నేపథ్యంలో పర్యటనకు రావాలంటూ ప్రధాని మోదీకి రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ లేఖ రాసింది. ట్రస్ట్ అధ్యక్షుడు నృత్య గోపాల్ దాస్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి రావాలని కోరినట్టుగా వెల్లడించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నిబంధనలు పాటిస్తామని చెప్పారు. 

ఇటీవల మందిరం నిర్మాణానికి కావాల్సిన భూమి పూజను ట్రస్ట్ నిర్వహించింది. దీంతో శ్రావణ మాసం చివరి రోజు ఆగస్టు 5న మంచి ముహూర్తం ఉండటంతో ఆ రోజు పనులు చేపట్టాలని నిర్ణయించారు. దీనికి ప్రధాని వచ్చి శంకుస్థాపన చేయాలని కోరాారు. వీలుకాని పక్షంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయినా అందుబాటులోకి రావాలని లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే అక్కడ నిర్మాణం కోసం కావాల్సిన పనులన్ని వేగంగా చేస్తున్నట్టు ట్రస్ట్ వెల్లడించింది. కాగా యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఇటీవల తన వ్యక్తిగతంగా ఆలయానికి రూ. 11 లక్షల విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే.