రామ్ జఠ్మలానిపైనా బయోపిక్!

ప్రముఖ న్యాయవాది రామ్ జఠ్మలాని జీవితం ఆధారంగా సినిమాను తీయాలని అనుకుంటున్నట్లు బాలీవుడు నటుడు కునాల్ ఖేము తెలిపాడు. సైఫ్‌ అలీ‌ఖాన్ బావమరిది, సోహా అలీఖాన్ భర్త అయిన కునాల్  జఠ్మలానికి పెద్ద అభిమాని. ఈ విషయాలన్నీ ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ‘

నాకు జఠ్మలాని గురించి అంతగా తెలియదు, కానీ ఆయనకు వీరాభిమానిని. మా నాన్న కూడా జఠ్మలాని గురించి చెపుతూ ఉంటే వినేవాడిని. నా స్నేహితుల్లో కూడా చాలా మంది న్యాయవాదులే  ఉన్నారు.  వాళ్ల ఏదన్నా చర్చించుకుంటున్నప్పడు నేను వింటూ ఉండేవాడిని. వారి మాటల్లో ఓక్కసారైనా జఠ్మలాని పేరు వినిపించకుండా ఉండదు. ఆయన న్యాయనికే తాతగారిలా వ్యవహరిస్తారు. ఆయన రాసిన పుస్తకాలు చదివాను. అప్పుడే ఆయన జీవిత చరిత్ర ఆధారంగా సినిమాను తెరకెక్కించాలని  నిర్ణయించుకున్నాను. ఈ విషయం గురించి నా భార్య సోహతో కూడా చెప్పాను. ఆ తర్వాత ఇద్దరం కలసి జఠ్మలాని కలిశాం. ఆయన జీవిత చరిత్ర ఆధారంగా సినిమాను తీస్తామని చెప్పాం.. అందుకాయన స్పందిస్తూ..  ‘ నా జీవితం గురించి తెలుసుకోవాలని  ఎవరికి ఉంటుంది?’అన్నారు. చాలా మందికి   ఆయన గురించి, న్యాయ శాస్త్రంలో తనకు ఉన్న అపార మేదాశక్తి గురించి , కేసులను పరిష్కరించే విధానం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారని చెప్పి సినిమాను తీసేందుకు అనుమతిని కోరాం. ఆయన అంగీకరించారు. త్వరలోనే సినిమాను ప్రారంభిస్తాం‘ అని’ కునాల్ తెలిపాడు. ఈ చిత్రంకు నిర్మాత కూడా కునాలే వ్యహరించనున్నారు.

SHARE