దశాబ్ధాల కల నెరవేరింది.. రామ జన్మభూమికి రామ్ లల్లా - MicTv.in - Telugu News
mictv telugu

దశాబ్ధాల కల నెరవేరింది.. రామ జన్మభూమికి రామ్ లల్లా

March 25, 2020

Ram Lalla

దశాబ్ధాలుగా హిందూ ప్రజలు కోరుకుంటున్న ఘట్టానికి యూపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయోధ్యలోని రామ్ లల్లా విగ్రహాన్ని రామజన్మభూమికి చేేర్చారు. బుధవారం ఉదయం 4 గంటల సమయంలో స్వామి విగ్రహాన్ని రామాలయం నిర్మించే ప్రాంతానికి తరలించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ స్వయంగా విగ్రహాలను తీసుకెళ్లి ప్రతిష్టించారు. రామ మందిరం నిర్మాణం పూర్తయ్యే వరకూ నేరుగా భక్తులు దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు. 

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నేపథ్యంలో కొంత మంది అర్చకులు, భద్రతా సిబ్బంది మధ్య ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. రామ జన్మభూమి ప్రాంగణంలోని మానస భవన్‌లోకి రాముని విగ్రహాన్ని ఆయన తరలించారు. 9.5 కిలోల వెండి సింహాసనంపై స్వామి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.  ఈ సందర్భంగా ఆలయ నిర్మాణం కోసం ఆయన రూ. 11 లక్షల చెక్ అందించారు. ఇక నేటి నుంచి అక్కడ పూజా కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి. లాక్‌డౌన్ నేపథ్యంలో దర్శనానికి భక్తులను అనుమతించడం లేదు. త్వరలోనే దర్శన ఏర్పాట్లు చేయనున్నారు.