రామ మందిరానికి ముహూర్తం పెట్టిన పండితుడికి బెదిరింపులు - MicTv.in - Telugu News
mictv telugu

రామ మందిరానికి ముహూర్తం పెట్టిన పండితుడికి బెదిరింపులు

August 4, 2020

Ram Mandir Astrologer Vijayendra Sharma

అయోధ్యలో రేపు జరిగే భూమి పూజ కోసం కోట్లాది మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. ఈ క్రమంలో ఆలయ భూమి పూజ కోసం ముహూర్తం పెట్టిన ప్రముఖ సిద్ధాంతి ఎన్.ఆర్.విజయేంద్రశర్మకు వేధింపులు మొదలయ్యాయి. గుర్తు తెలియని వ్యక్తుల ఆయనకు ఫోన్ చేసి ముహూర్తం ఎందుకు పెట్టావంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. అది సరైన ముహూర్తం కాదనీ, మరో ముహూర్తం పెట్టాలని ఒత్తిడి తెస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడి ఇంటి వద్ద భద్రతను పెంచారు. 

కర్నాటకలోని బెల్గావిలో నివసిస్తున్న విజయేంద్ర శర్మ ఆగస్టు 5ను భూమి పూజకు మంచి ముహూర్తమని చెప్పారు. కాగా మొదట్లో ఆయన ఏప్రిల్‌లో ఓ తేదీని సూచించారు. కానీ అప్పటికే దేశంలో కరోనా వ్యాపించడంతో వాయిదా వేశారు. ఆ తర్వాత నాలుగు తేదీలను ప్రతిపాదించారు. అందులో ఒకటి జూలై 29, జూలై 31, ఆగస్టు 1 ఆగస్టు 5 శుభ సందర్భాలు అని చెప్పారు. దీంతో ట్రస్ట్ సభ్యులు ఆగస్టు 5 మధ్యాహ్నం 12.30 గంటలకు ముందే పునాది వేయాలి నిర్ణయించారు. దీంతో ఆయనకు వేధింపులు ప్రారంభం అయ్యాయి. కాగా అయోధ్య భూమి పూజ నేపథ్యంలో ప్రముఖులకు భద్రత పెంచారు. దాడులు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అలర్ట్ అయ్యారు. 

ఎవరు ఈ విజయేంద్ర శర్మ : 

కర్నాటకు చెందిన ఎన్ఆర్ విజయేంద్ర శర్మ ప్రముఖ జోత్యిష్యుడు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయం పట్టా పొందారు. ఆయన ఎనిమిది భాషలు అనర్గళంగా మాట్లాడగలరు. రాజకీయ నాయకులకు ముహూర్తాలు, జోతిష్యం చెప్పేవారు. మాజీ ప్రధాన మంత్రులు మొరార్జీ దేశాయ్,అటల్ బిహారీ వాజ్‌పేయిలకు కూడా సలహా ఇచ్చారు. వాజ్‌పేయ్ ప్రధానిగా ఎన్నికైన తర్వాత తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తేదీని కూడా ఈయనే  నిర్ణయించారు. అందుకే కొంత కాలం క్రితం అయోధ్య రామాలయ ట్రస్ట్ సభ్యులు ముహూర్తం కోసం అతన్ని సంప్రధించారు.