పాకిస్తాన్‌లోని మరో హిందూ దేవాలయం ధ్వంసం అయింది. గత కొన్ని రోజులుగా పాకిస్తాన్లో ఉన్న హిందువులపై, హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. హిందువులు ఎక్కువగా ఉండే సింధ్ ప్రావిన్స్ ఈ దాడులు ఎక్కువగా జరుగున్నాయి. ఇమ్రాన్ ఖాన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ దాడులు ఎక్కువ అయ్యాయి.
ఈనెల 10న కొందరు దుండగులు సింధ్ ప్రావిన్స్‌లోని బాదిన్ ఏరియాలో ఉన్న రామ్ మందిర్‌ను కూల్చివేశారు. దీనిపై హిందూ సంఘాలు ఫిర్యాదులు చేసినా కూడా పాక్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. స్వాతంత్య్రం సింధ్ ప్రావిన్స్‌లో 428 హిందూ దేవాలయాలు ఉండేవి. ప్రస్తుతం 20 దేవాలయాలు మాత్రమే ఉన్నాయి. భవిష్యత్తులో ఈ మందిరాలు కూడా ఉంటాయనే నమ్మకం లేదని అక్కడి హిందువులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ దాడులు మరింత ఎక్కువైనట్టు అక్కడి ప్రజలు వెల్లడించారు.