Ram Pothineni, who is going to get married, is the bride's daughter
mictv telugu

పెళ్లి పీటలు ఎక్కబోతున్న రామ్ పోతినేని..పెళ్లి కూతురు ఆమెనట

June 27, 2022

”పెళ్లి అనేది మన చేతుల్లోనే ఉంది. జరగాల్సిన సమయంలో, జరగాల్సిన వ్యక్తితో జరుగుతుంది” అని టాలీవుడ్ స్టార్ హీరో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, చాకొలేట్ బోయ్ రామ్ పోతినేని గతంలో ఓ ఇంటర్య్యూలో చెప్పాడు. చెప్పిన విధంగానే రామ్ పోతినేని త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలు, స్కూల్ మేట్ అయిన ఓ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. కొంతకాలం నుంచి ప్రేమలో ఉన్న వీళ్లిద్దరు ఇటీవలే పెళ్లి బంధంతో ఒకటి కావాలని నిర్ణయించుకున్నారు. వీరు ప్రేమకు ఇరుకుటుంబాల సభ్యులు ఏకీభవించడంతో, పెళ్లి కార్యక్రమాల్ని మొదలుపెట్టేందుకు సన్నద్ధమవుతున్నారు.

అయితే, పెళ్లికి సంబంధించి ఈ ఏడాది ఆగస్ట్‌లో కానీ, సెప్టెంబర్‌లో కానీ పెళ్లి జరగవచ్చని సమాచారం. పెళ్లి తేదీలకు సంబంధించి రామ్ కుటుంబ సభ్యులు త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నారు. ఇక రామ్ తాజా చిత్రం ‘వారియర్’ జులై 14న విడుదల కాబోతోంది. సినిమా విడుదలైన తర్వాత వీరి ఎంగేజ్‌మెంట్ జరగనుంది. ఆ తర్వాత ఆగస్ట్ లేదా, సెప్టెంబర్‌లో పెళ్లి జరుగనుంది. ఈ ప్రకటనతో రామ్ అభిమానులు తెగ సంతోషపడుతున్నారు. రామ్ మీ పెళ్లి ఎప్పుడు? లవ్ మ్యారేజ్ చేసుకుంటారా? పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటారా? అని రామ్ పోతినేని పలు ఆడియో ఫంక్షన్‌లో యాంకర్లు, ఫ్యాన్స్ అడిగారు. దానికి రామ్ చిరునవ్వుతో సమాధానాలు చేప్తూ, దాటవేశారు. ఈ క్రమంలో త్వరలోనే తన చిన్ననాటి స్నేహితురాలను రామ్ పోతినేని వివాహం చేసుకోబోతున్నారు.