రామ్‌ సేతు రివ్యూ - MicTv.in - Telugu News
mictv telugu

రామ్‌ సేతు రివ్యూ

October 25, 2022

 


బాలీవుడ్‌ లో మైథాలజీ నేపథ్యమున్న చిత్రాలకి ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. కథ, కంటెంట్‌ కరెక్ట్‌ గా కుదిరిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్‌ దగ్గర బంపర్‌ హిట్లుగా నిలిచాయి.రీసెంట్‌ గా వచ్చిన కార్తికేయ టూ అందుకు బెస్ట్‌ ఎగ్జాంపుల్. తెలుగు డబ్బింగ్ మూవీనే అయినా నార్త్‌ ఆడియెన్స్‌ ఆ చిత్రాన్ని బాగా ఆదరించారు. సేమ్ అట్లనే మైథాలజీ బ్యాక్ డ్రాప్ తో దీపావళి స్పెషల్‌ గా ఈ మంగళవారం అక్షయ్‌ కుమార్‌ నటించిన రామ్‌ సేతు చిత్రం హిందీ, తెలుగు భాషల్లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. రామ్ సేతు సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుందా?
కంటెంట్‌ తో కట్టిపడేసిందా? అన్నది ఇప్పుడు చూద్దాం.

విషయానికొస్తే..

ట్రైలర్ లో చూయించినట్టే మైథాలజీ బ్యాక్‌ డ్రాప్‌ తో పాటు, రామ సేతు గురించి కొన్ని ఇంట్రస్టింగ్‌ సీన్స్, విజువల్‌ ఎఫెక్ట్స్‌ తో సినిమా తెరకెక్కింది. సాధారణంగా ఇలాంటి స్క్రిప్టులని ఎంచుకున్నప్పుడు తర్వాత ఏం జరుగుతుంది అన్న ఉత్సుకతని ప్రేక్షకుల్లో కలిగించాలి. కానీ ఈ చిత్రంలో అది లోపించి కొన్ని అప్స్‌ అండ్ డౌన్స్‌ మధ్య అలా సా..గిపోయింది. కాన్‌ ఫ్లిక్ట్‌ అంత బలంగా లేకపోవడంతో ఆడియెన్స్‌ కి కొత్త థ్రిల్ కలిగే అవకాశం లేకుండా పోయింది.క్లైమాక్స్‌ ట్విస్ట్‌ మాత్రం చాలా బాగుంది. చెప్పాలంటే అది సినిమా మొత్తానికి హైలైట్‌. థియేటర్ నుంచి బయటికొచ్చే ప్రేక్షకుడికి హై ఇచ్చే ఎలిమెంట్‌ అదే.

హీరోగా అక్షయ్‌ కుమార్‌ రోల్‌

పాత్ర పరంగా హీరో అయిన అక్షయ్‌ కుమార్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌ ఆర్టిఫిషియల్‌ గా అనిపిస్తుంది.క్లైమాక్స్‌ కోర్టు సీన్ లో ఆయనలో వచ్చే మార్పు సహజంగా అనిపించకపోగా బలవంతంగా రుద్దినట్టనిపిస్తుంది.ఇలాంటి జానర్లలో హీరోకి అనేక సమస్యలు ఎదురవ్వడం, వాటిని హీరో అధిగమించడం లాంటి ఎలిమెంట్స్‌ కచ్చితంగా కావాల్సి వస్తుంది.కానీ స్క్రిప్టులో అవి మిస్సవడంతో ప్రేక్షకుడు హీరోతో కనెక్టయి కథలో లీనమవడానికి పెద్దగా స్కోప్‌ లేకపోయింది.

కొన్ని సీన్లు మాత్రం రీసెర్చ్ అండ్ సైన్స్‌, టెక్నాలజీని బేస్‌ చేసుకుని తీసినా చాలా సీన్లు సినిమాటిక్‌ గా అనిపిస్తాయి.దాదాపు ప్రతీది హీరోకి అనుకూలంగానో, అనుకున్నట్టుగానో జరుగుతుండడంతో ప్రేక్షకుడికి ఆసక్తి తగ్గిపోతుంటుంది.
కథ కూడా సోసో అనిపించడంతో పాటు స్క్రీన్ ప్లే ఇంకాస్త బలంగా ఉంటే బాగుండనిపిస్తుంటుంది.
ట్రైలర్లో చెప్పినట్టు “ఈ ప్రపంచంలో శ్రీరాముడికి వేల మందిరాలున్నాయి. కానీ సేతు ఒక్కటే ఉంది లాంటి డైలాగులతో పాటు ”మనదేశంలో జనం నిజం వినడానికి ఇష్టపడరు. వాళ్లు ఏది ఇష్టపడతారో అదే నిజం అని నమ్ముతారు.”
లాంటి డైలాగ్స్‌ బాగున్నాయి.
కోర్ట్‌ సీన్లోనూ కొన్ని సంభాషణలు బాగున్నాయి. రైటింగ్‌ టీమ్‌ మంచి రీసెర్చ్‌ చేశారు.
కొన్ని చోట్ల గ్రాఫిక్స్‌ అంతగా ఆకట్టుకోలేకపోయినా సముద్రగర్భంలోని కొన్ని సీన్లు బాగున్నాయి.
ఇలాంటి జానర్లకి నేపథ్య సంగీతమే ప్రధాన బలం కాబట్టి దాని మీద ఇంకాస్త శ్రద్ధ పెడితే బాగుండేది.
ప్రొడక్షన్‌ వాల్యూస్‌ కూడా బాగున్నాయి. కథని నమ్మి ఏ మాత్రం కాంప్రమైజ్‌ కాకుండా పెట్టిన ఖర్చు తెరపై కనిపిస్తుంటుంది.
సత్యదేవ్‌ పాత్ర ప్రేక్షకులకి బాగా గుర్తుండిపోతుంది. పాత్రకి తగ్గట్టుగా అతని నటన కూడా అద్భుతంగా ఉంది.ఈ చిత్రంతో నటుడిగా బాలీవుడ్‌ లోనూ తన మార్కెట్‌ మరింత పెరగడం పక్కా.
జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌, నాజర్‌ కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.

ఫైనల్‌ పాయింట్‌ ఏంటంటే..

పాజిటివ్ పాయింట్స్‌ గా ఆర్ట్‌ డైరెక్షన్, ఫోటోగ్రఫీ, అక్షయ్‌ కుమార్‌, సత్యదేవ్‌ నటన అని చెప్పుకుంటే..
నెగిటివ్స్‌ గా వన్ సైడెడ్ స్క్రిప్ట్, ఇంట్రస్ట్‌ కలిగించని కాన్‌ ఫ్లిక్ట్‌, చాలాచోట్ల సినిమాటిక్ లిబర్టీ అని చెప్పుకోవచ్చు.
ఓవరాల్‌ గా మాత్రం రామ్‌ సేతు మూవీ ప్రేక్షకులకి సోసో నే అనిపిస్తుంది.