ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం కుప్పం పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆసక్తికర విషయం బయటపడింది. రామకుప్పం పోలీస్ స్టేషన్ ఎస్ఐ వెంకట శివకుమార్ రివాల్వర్ మిస్ అయింది. ఈ మిస్సింగ్ వ్యవహారంలో ఎస్సై శివకుమార్, హెడ్ కానిస్టేబుల్ సుబ్రహ్మణ్యం మధ్య వివాదం జరుగుతోంది.
హెడ్ కానిస్టేబుల్కు తాను ఫిబ్రవరి మొదటివారంలో రివాల్వర్ ఇచ్చానని ఎస్ఐ చెబుతున్నారు. అయితే సర్వీసింగ్ తర్వాత తుపాకీని ఆయనకు తిరిగిచ్చేశానని సుబ్రహ్మణ్యం బదులిస్తున్నారు. దీంతో రివాల్వర్ మిస్సింగ్ సంగతి తెలుసుకున్న ఉన్నతాధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.