సీఓఏకు రాజీనామా చేసిన రామచంద్ర గుహ బిగ్ లెటర్ బాంబ్ పేల్చారు. తాను ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందన్నదానిపై కమిటీ హెడ్ వినోద్ రాయ్‌కు లేఖ రాశారు. అందులో బీసీసీఐ తీసుకున్న నిర్ణయాలపై ఆయన అసంతృప్తి వ్యక్తంచేశారు. కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ ప్రేక్షక పాత్ర పోషించాల్సి వస్తున్నదన్నారు. కాంట్రాక్ట్‌ల విషయంలో సూపర్‌స్టార్ స్టేటస్ చూడటంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకున్నా.. ప్లేయర్స్ కాంట్రాక్ట్‌లో ఎ గ్రేడ్ ఇవ్వడాన్ని గుహ ఇలా తప్పుబట్టారు. ఇక మాజీ ప్లేయర్ సునీల్ గవాస్కర్‌ను కూడా గుహ వదల్లేదు. అటు కామెంటేటర్‌గా ఉంటూ ఇటు ప్లేయర్ మేనేజ్మెంట్ కంపెనీని నిర్వహించడమేంటని నిలదీశారు గవాస్కర్ కంపెనీయే శిఖర్ ధావన్‌ను మేనేజ్ చేస్తుండటంతో టీమ్‌లో అతని ఎంపికపై క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి.
ఇక కెప్టెన్ కోహ్లి, కోచ్ కుంబ్లే మధ్య విభేదాలపై రామచంద్ర గుహ అసంతృప్తి వ్యక్తంచేశారు. ఈ విషయంలో కుంబ్లేనే ఆయన వెనుకేసుకొచ్చారు. వివాదాలకు దూరంగా ఉండే కుంబ్లేను బీసీసీఐ ట్రీట్ చేసిన విధానంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. వ్యక్తిగత కారణాలంటూ ఆయన సుప్రీంకోర్టుకు తన రాజీనామా లేఖను సమర్పించారు. దీనిపై జులై 14న కోర్టు విచారణ జరపనుంది. అంతవరకు సీఓఏ కూడా ఆయన రాజీనామాను ఆమోదించకూడదని నిర్ణయించింది.