రామానాయుడు స్టూడియోలో ఎక్సైజ్ తనిఖీలు - MicTv.in - Telugu News
mictv telugu

రామానాయుడు స్టూడియోలో ఎక్సైజ్ తనిఖీలు

August 4, 2017

డ్రగ్స్ కేసు విచారణల పర్వంలో 12 మంది సెలెబ్రిటీలను విచారించింది సిట్ బృందం. తెలంగాణ ఎక్సైజ్, ప్రొబిషన్ డిపార్ట్ మెంట్ అధికారుల తదుపరి అడుగుగా రామానాయుడు స్టూడియోకి వెళ్ళారు. అక్కడ తనిఖీలు నిర్వహించారు ఎక్సైజ్ అధికారిణి కనకదుర్గ. ఆ స్టూడియోకు రానా పేరు మీద వచ్చిన కొరియర్స్ ని పరిశీలించారు. దుబాయి నుండి వచ్చిన ఆ ప్యాకెట్లట్లో డ్రగ్స్ ఏమైనా వస్తున్నాయా అని సందేహించింది ఎక్సైజ్ శాఖ. ఇందుకు రామానాయుడు స్టూడియో మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ బాబు పార్సెల్ యొక్క కంటెంట్లను చూపించి సహకరించారు. దుబాయ్ నుండి మంగళవారం రానాకు కొరియర్లో ఏమొచ్చిందనే విషయమై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

సురేష్ బాబు కాస్త అసహనాన్ని వ్యక్తం చేస్తూ తమక్కూడా సిట్ నోటీసులు వచ్చాయని వస్తున్న వదంతులను ఖండించారు. ఈ కేసుకు సంబంధించిన మూడు ప్రధాన కొరియర్ కంపెనీలను కూడా సిట్ పిలిపించింది. డ్రగ్స్ మాదక ద్రవ్యాలు ఎక్కువగా విదేశాల నుండే పార్శిల్లు రావడం వల్లే సిట్ కొరియర్ సర్వీసుల మీద దృష్టి సారించింది. DHL, బ్లూ డార్ట్ మరియు ఫెడెక్స్ కు సంబంధించిన అధికారులు SIT ​​ముందు హాజరు కావాలని కోరారు. తపాలా శాఖ పాత్ర కూడా వుందని గ్రహించిన SIT పరిశోధనలో తన మద్దతు కోసం చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ కు లేఖ రాసింది.
కొరియర్ సర్వీసులు మరియు తపాలా శాఖ విదేశాల నుంచి సరఫరా చేసిన మందులను గుర్తించడం మీదే ఇప్పుడు సిట్ దృష్టి సారించింది. ఆ కోణంలోనే రామానాయుడు స్టూడియోలో తనిఖీలు నిర్వహించామని ఎక్సైజ్ అధికారులు పేర్కొన్నారు.