రామాయణం అంతా ఫేక్.. బోగస్..! - MicTv.in - Telugu News
mictv telugu

రామాయణం అంతా ఫేక్.. బోగస్..!

December 3, 2017

‘రామాయణం అంతా కట్టుకథ.. అబద్ధాల పుట్ట.. మూడు రకాల వాల్మీకి రామాయణాలు ఉన్నాయి. అన్నీ అభూత కల్పనలే.. వాల్మీకీ రామాయణంలో సత్యం లేదు.. ఈ రామాయణాలు పరిశీలించాకు నాకు ఉన్న భక్తి కూడా పోయింది ’ ఈ మాటలు అన్నది ఏ నాస్తికుడో, కమ్యూనిస్టో కాదు. మానసిక స్థిమితం లేనివాడు అసలేకాదు. లక్షలాది భక్తులు ఉన్న ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రమణానంద మహర్షి. ఆయన రామాయణంపై చేసిన విమర్శనాత్మక వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతున్నాయి.

ఆయనేమన్నారంటే..

‘రామాణం కట్టుకథ.. అందులో చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలు.. అసత్యాలు..  రామాయణం జరిగిందని చెప్పడానికి ఆధారాల్లేవు. రెండువేల ఏళ్ల కిందటి మనుషుల గురించే మనకు ఆధారాల్లేవు. ఇక లక్షల ఏళ్ల కిందట జరిగినట్లు చెబుతున్న రామాయణానికి ఆధారాలేమిటి? .. ఆంజనేయుడు గొప్ప వక్త అని, నాలుగు  వేదాలు చదివినవాడే ఇలా మాట్లాడతాడని రాముడు అన్నాడు. హనుమంతుడు వానరుడు.. అంటే కోతి. మరి ఇప్పుడున్న కోతులు ఎందుకు మాట్లాడడం లేదు? వేదాలు ఎందుకు నేర్చుకోవడం లేదు? ఆంజనేయుడు కోతే అయితే ఆనాడు ఎలా మాట్లాడాడు? ఆయన మాట్లాడిందే నిజమైతే.. ఇప్పుడున్న కోతులు కూడా మాట్లాడాలి కాదా. కోతులు పుస్తకాలు చదవవు. చించేస్తాయిగాని.  ఇక అహలస్య కథ గురించి.. అది అసత్య ప్రచారం. .రాయి ఎక్కడైనా ఆడదానిగా మారుతుందా?’ అని రమణానంద మహర్షి అన్నారు.

రమణానంద ఇదివరకు కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. షిర్డీ సాయిబాబా గుళ్లలో హిందువుల దేవుళ్ల విగ్రహాలు పెట్టడం సరికాదని అన్నారు. ఎవడు పడితే వాడు ఆ పీఠం, ఈ పీఠం అని పెడుతూ ప్రజలను మోసగిస్తున్నారని అన్నారు.