రామరాజ్యానికి అంతిమయాత్ర.. తమిళుల సటైర్ సాంగ్.. - MicTv.in - Telugu News
mictv telugu

రామరాజ్యానికి అంతిమయాత్ర.. తమిళుల సటైర్ సాంగ్..

March 23, 2018

తమిళనాడులో పెరియార్ విగ్రహాల విధ్వంసం వల్ల బీజేపీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గత నెల అయోధ్యలో మొదలైన రామరాజ్య రథయాత్ర మంగళవారం రాష్ట్రంలోకి ప్రవేశించడంతో ద్రవిడ ఉద్యమకారులు భగ్గుమంటున్నారు. యాత్రకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం పలువురిని అదుపులోకి తీసుకుంది. మరోపక్క.. కళాకారులు రంగంలోకి దిగారు. ఈ యాత్రను, మోదీని ఎద్దేవా చేస్తూ పాటలు పాడుతున్నారు. ప్రజాగాయకుడు కోవల్ పాడిన పాట వైరల్ అవుతోంది.

మతోన్మాద ఛాయలు లేని తమిళనాడు బీజేపీ మతవిద్వేషాలు రెచ్చగొడుతోందని, రాష్ట్రంలోని అన్నాడీఎంకే సర్కారును కీలుబొమ్మను చేసి ఆడిస్తోందని పాటలో ఎండగట్టారు. మక్కల్ కలై ఇళక్కియ కళగమ్(ప్రజాకళాసాహిత్య మండలి) దీన్నిరూపొందించింది.

‘మీరెక్కడ యాత్ర చేస్తున్నారు? ఇది మీ రామరాజ్యానికి ఇదే అంతిమయాత్ర. రామరాజ్యం అంటే మోదీ రాజ్యం. మీరు ఆర్యులైనా నాశనం తప్పదు. రాముడు చెప్పులతో రాజ్యం చేశాడు, మోదీ కూడా తమిళనాడును తన చెప్పులతో ఏలుతున్నాడు. రాముడు తన భార్యను వదిలేశాడు.. మోదీ సంగతి నాకు తెలియదు.. రాముడు తన భార్యను వెనక్కి తెచ్చుకుంటే నేనెందుకు పండగ చేసుకోవాలి? కావేరి మా ఆడబిడ్డ. మీరు ఆమెను కిడ్నాప్ చేశారు.. రామరాజ్యం అంటే గుజరాత్ మోడల్.. నీళ్లుండవు, స్కూళ్లుండవు, అంతా గుండుసున్న. అది అంబానీ, అదానీలది. అమాయక హిందువులకు ఆవు మూత్రమే మిగిలింది..’ అంటూ సాగుతోందీపాటు. దీన్ని సోషల్ మీడియో విపరీతంగా షేర్ చేసుకుంటున్నారు. కోవన్ గతంలోనూ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పాటలు పాడారు. దేశద్రోహం కింద కేసులు కూడా ఉన్నాయి.