సీతకు ఒకడే కొడుకు, కుశుడు పుల్ల.. చిక్కుల్లో టీటీడీ - MicTv.in - Telugu News
mictv telugu

సీతకు ఒకడే కొడుకు, కుశుడు పుల్ల.. చిక్కుల్లో టీటీడీ

June 2, 2020

Ramayana Controversial Story in Sapthagiri Paper

టీటీడీని మరో వివాదం చుట్టుముట్టింది. రామాయణాన్ని వక్రీకరిస్తూ సప్తగిరి మాస పత్రిలో రాసిన కథనం సంచలనంగా మారింది. అందులో సీతకు లవుడు ఒక్కడే కొడుకని, కుశుడు దర్భతో చేసిన చెక్క బొమ్మగా పేర్కొన్నారు. దీంతో ధార్మిక సంస్థ ఇలా హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా చేయడం ఏంటని పలువురు మండిపడుతున్నారు. స్థానిక బీజేపీ నేతలు కూడా నిరసనకు దిగడంతో కేసు నమోదు చేశారు. ఉన్నతాధికారులు స్పందించి దీనిపై విచారణ చేపట్టారు. 

తిరుపతికి చెందిన తొమ్మిదో తరగతి బాలుడు పునీత్ పేరుతో ఓ వ్యాసం ప్రచురితమైంది.దీంతో హిందూ సంఘాలు మండిపడ్డాయి. వాల్మీకి రాసిన రామాయణాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జానపదాల్లో రకరకాల ప్రచారాలు ఉన్నాయని, కానీ వాటికి ప్రాధాన్యం ఇవ్వడం సరికాదని అభిప్రాయపడ్డారు. రామాయణాన్ని తప్పుదారి పట్టించేలా వచ్చిన కథనాన్ని ప్రచురించిన పత్రిక నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వ్యక్తమౌతోంది. దీంతో ఆ పత్రిక ఎడిటర్‌ను పోలీసులు విచారిస్తున్నారు.