మా మామ చావలేదు..‘రావణుడి’ మేనల్లుడి క్లారిటీ - MicTv.in - Telugu News
mictv telugu

మా మామ చావలేదు..‘రావణుడి’ మేనల్లుడి క్లారిటీ

May 4, 2020

అలనాటి ‘రామాయణ్‌’ సీరియల్‌లో రావణ పాత్రలో నటించిన అరవింద్‌ త్రివేది లంకేశ్‌(82) మరణించారని గత కొని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అరవింద్ మరణించారని ఎందరో నెటిజన్లు సోషల్ మీడియాలో నివాళ్లు తెలియజేస్తున్నారు. ఈ విషయం అరవింద్ కుటుంబానికి తెల్సింది. దీంతో వాళ్ళు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అరవింద్ మేనల్లుడు దీనిపై స్పందించారు. 

అరవింద్‌ మరణించినట్టు జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని ఆయన మేనల్లుడు కౌస్తుభ్‌ ట్విట్టర్ లో తెలిపారు. ‘మా అంకుల్‌ అరవింద్‌ త్రివేది లంకేశ్‌ క్షేమంగా ఉన్నారు. దయచేసి ఆయనపై అసత్య ప్రచారం చేయకండి. ఆయన బతికే ఉన్నారన్న సమాచారాన్ని అందరికీ  తెలియజేస్తున్న’ అని కౌస్తుభ్‌ ట్వీట్‌ చేశారు. 

లాక్ డౌన్ కారణంగా అలనాటి ‘రామాయణ్’ సీరియల్‌ పునః ప్రసారం అవుతున్న సంగతి తెల్సిందే. మార్చి 28 నుంచి ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు, అలాగే సాయంత్రం 9 నుంచి 10 గంటల వరకు డీడీ నేషనల్‌(దూరదర్శన్) చానల్‌లో దీన్ని ప్రసారం చేస్తున్నారు. ఈ సీరియల్ లో రావణాసురుడి పాత్రలో అరవింద్ త్రివేది నటించారు. అరవింద్ కొన్ని రోజుల క్రితం ఈ సీరియల్‌ను టీవీలో వీక్షించారు. సీతాపహరణ సన్నివేశం చూసి ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. నేను తప్పు చేశాననని, సీతను కిడ్నాప్ చేసినందుకు క్షమించాలని ప్రజలను కోరారు.