మొన్నటి వరకు నల్లని దుస్తుల, చెప్పులు లేకుండా అయ్యప్ప మాలలో కనిపించిన రామ్‌చరణ్ ప్రస్తుతం స్టైలిష్‌లుక్‌లో మెరిసిపోతున్నారు. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఫిల్మ్ అవార్డ్స్ ఫంక్షన్ కోసం అమెరికా వెళ్లిన రామ్‌చరణ్ అయ్యప్పమాలను తీసివేశారు. అమెరికా వెళ్లేందుకు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్‌కు వచ్చిన సమయంలో కూడా రామ్‌చరణ్ మాలధారణలో కనిపించారు.
అగ్రరాజ్యం చేరుకున్నాక ఓ ఆలయంలో రామ్ చరణ్ అయ్యప్ప మాల తీసినట్లు తెలిసింది. పలు కార్యక్రమాలకు హాజరుకావాల్సి ఉండడంతో మాలధారణను తొలగించారు. అయ్యప్ప మాల తీశాక రామ్ చరణ్ డ్రైస్సింగ్ స్టైల్ ఆకట్టుకుంది. గుడ్ మార్నింగ్ అమెరికా (Good Morning America) కార్యక్రమానికి రామ్ చరణ్ ఓ అదిరిపోయే షూట్లో హాజరయ్యారు. ఆ కార్యక్రమానికి వెళ్ళిన ఆయనను చూడటానికి ఫ్యాన్స్ తరలి వచ్చారు. వాళ్ళతో చరణ్ సెల్ఫీలు దిగారు. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
హాలీవుడ్ క్రిటిక్ అసోసియేషన్ ఇచ్చే అవార్డుల వేడుకలకుగాను చరణ్‌కు ప్రత్యేక ఆహ్వానం అందింది రేపు జరగనున్న హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ వేడుకలో ఆయన ప్రెజెంటర్ గా వ్యవహరించనున్నారు.