ఆర్ఆర్ఆర్ సినిమాతో అంతర్జాతీయంగా మంచి పాపులారిటీ సంపాదించడంతో రాంచరణ్ ఫుల్ ఖుషీలో ఉన్నాడు. కలెక్షన్లు, అవార్డులతో పాటు పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సరదాగా గడుపుతున్నాడు. ఈ క్రమంలో ఓ అంతర్జాతీయ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘చిన్నప్పటి నుంచి నటనంటే ఇష్టం. కాలేజీకి వెళ్లినా చదువు ఎక్కేది కాదు. నాన్మేమో మొదట చదువు పూర్తి చేయి తర్వాత నీకిష్టమైంది చేయమని సలహా ఇచ్చేవారు. అలా ఆసక్తి లేకుండా దీర్ఘకాలంగా చదువుతూ రావడంతో మా డీన్ ఉండబట్టలేక మా నాన్నకు ఫోన్ చేశాడు. మీ అబ్బాయికి ఏం కావలనిపిస్తే అదే చేయనివ్వండి.
అనవసరంగా మా సమయం, మీ కొడుకు సమయాన్ని వేస్ట్ చేయవద్దని చెప్పడంతో యాక్టింగ్ స్కూలుకు షిఫ్ట్ అయ్యాను’ అంటూ చెప్పుకొచ్చారు. తర్వాత నాన్న చిరంజీవితో తన అనుభవాన్ని ప్రస్తావించాడు. ‘యాక్టర్ గా 40 ఏళ్లుగా నాన్న సినిమాల్లో ఉన్నారు. ఎంత తండ్రి అయినా కొన్ని విషయాల్లో చాలా కఠినంగా ఉంటాడు. బాడీ షేప్ కొంచెం మారిందంటే అస్సలు ఊరుకోడు.
డైనింగ్ టేబుల్ వద్ద భోజనం చేసేటప్పుడు బరువు తగ్గిపోయావేంట్రా.. అని అంటే నిజమేనని నేను తలూపేవాడిని. ఇడియట్ నేనేదో సరదాగా అన్నాను. ఇప్పటికే చాలా బరువు పెరిగిపోయావు. ఏమైనా పట్టించుకుంటున్నావా? జిమ్ కి వెళ్లు అంటూ కోప్పడేవారు. ఈ మాటలు విని అక్కడే ఉన్న నా భార్య ఏంటీయన.. ఇలా అవమానిస్తున్నాడేంటి? అంటూ ఆశ్చర్యపోయేది. కానీ అది అవమానించడం కాదు. ఇద్దరు యాక్టర్ల మధ్య మాటలు ఇలాగే ఉంటాయని చెప్పేవాడిని’ అంటూ చెప్పుకొచ్చాడు.