ramcharan, upasana enjoyed in southafrica
mictv telugu

ఆఫ్రికా అడవుల్లో రామ్‌చరణ్ జంట ఎంజాయ్..వీడియో వైరల్

November 4, 2022

సినిమాలతో బిజీ బిజీ ఉండే రామ్‌ చరణ్ విరామం దొరికిన సమయంలో ఫ్యామిలీతో హ్యాపీగా గడుపుతారు. కాస్త సమయం వస్తే చాలు విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. ఆయన భార్య ఉపాసనతో కలిసి అక్కడి అందమైన ప్రదేశాలను చుట్టేస్తారు. తాజాగా ఆయన దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్నారు. అక్కడి పలు ప్రాంతాలను సందర్శిస్తూ వాటిని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. కొద్ది రోజుల కిందట టాంజానియాలోని ఓ సఫారీలో సింహాలను దగ్గరుండి రామ్ చరణ్ ఫొటోలు తీస్తున్న వీడియోను ఆయన పోస్ట్ చేశాడు. ఇప్పడు తాజాగా తమ పర్యటనకు సంబంధించిన వీడియోను ఇన్ స్టా గ్రామ్ లో ఉపాసన పోస్ట్ చేశారు. ఇందులో ఎక్కువ సింహాలు కనిపిస్తున్నాయి. అలాగే, రామ్ చరణ్, ఉపాసన నేలపై సేద తీరడం, ఓ చెట్టు దగ్గరకు చేరి ఫొటోలు తీసుకోవడం ఈ వీడియోలో మనం చూడొచ్చు. గత నెల RRR ప్రమోషన్ కోసం జపాన్ వెళ్లిన రామ్ చరణ్, ఉపాసన అటు నుంచి అటు ఆఫ్రికాకు వెళ్లి అక్కడి అందాలను వీక్షిస్తున్నారు.


రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత మెగా పవర్‌స్టార్ రామ్‌ చరణ్ టాప్ డైరెక్టర్లలో ఒకరైన శంకర్‌తో కలిసి పాన్ ఇండియన్ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తుండగా..కియరా అద్వానీ హిరోయిన్‌గా నటిస్తుంది.