బర్రె ఎక్కిన రాంచరణ్.. - MicTv.in - Telugu News
mictv telugu

బర్రె ఎక్కిన రాంచరణ్..

October 30, 2017

రాంచరణ్, ఉపాసన దంపతులు ఏమాత్రం కాస్త ఖాళీ దొరికినా షికార్లు కొడుతుంటారు. ఆ ముచ్చట్లను ఉపాసన సోషల్ మీడియాతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా  రాంచరణ్ ఓ జడలబర్రెపైన కూర్చున్న ఫొటోను ఆమె పోస్ట్ చేసింది. ఆ బర్రెను ఉపాససే ముందుకు నడిపిస్తూ ఉంది. ఈ ఫొటో నెటిజన్లను భలే ఆకర్షిస్తోంది. అయితే ఫొటోను ఎక్కడ తీయించుకున్నారో ఆమె చెప్పలేదు. బతుకమ్మ పండగ సందర్భంగా రాంచరణ్ బతుకమ్మ ఆడుతున్న వీడియోను ఉపాసన పోస్ట్ చేయడం తెలిసిందే.