Ramesh who earned 5 lakhs with 11 thousand crore rupees that came for free
mictv telugu

పొరపాటున ఖాతాలో వేలకోట్లు.. గంటల్లో మాయం.. ఆలోపే 5 లక్షల సంపాదన

September 16, 2022

Ramesh who earned 5 lakhs with 11 thousand crore rupees that came for free

బ్యాంకు ఖాతాల్లో కొన్ని సార్లు కోట్ల రూపాయల డబ్బు జమకావడం అనేది ఈ మధ్య తరుచూ జరుగుతోంది. సాంకేతిక కారణాల వల్ల ఇలా జరుగుతుండగా, తర్వాత బ్యాంకు వారు దానిని పసిగట్టి వెంటనే స్పందిస్తారు. నోటీసులిచ్చి సదరు డబ్బును తిరిగి తీసుకుంటారు. ఈ లోపు కొందరు వ్యక్తులు సంభ్రమాశ్చర్యానికి లోనై కొంత ఖర్చు చేయడమో లేదా అప్పులు తీర్చడమో చేస్తుంటారు. కానీ, గుజరాత్‌కి చెందిన ఓ వ్యక్తి ఇలాంటి పనులు చేయకుండా చాలా తెలివిగా వ్యవహరించాడు.

అహ్మదాబాద్‌కు చెందిన రమేష్ భాయ్ సాగర్ అనే వ్యక్తి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతుంటాడు. ఈ క్రమంలో జులై 26న అతని ఖాతాలో ఉన్నట్టుండి రూ. 11,677 కోట్లు వచ్చి పడ్డాయి. దాంతో మొదట ఆశ్చర్యపోయిన రమేష్.. తరచూ ఇలా జరుగుతుంటుందని భావించి ఎలాంటి భావోద్వేగానికి లోనవలేదు. కొద్దిసేపటికే ఆ నగదు మాయమవుతుందని అతనికి తెలుసు. అందుకే కంగారు పడకుండా వెంటనే రెండు కోట్లను స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాడు. కొన్ని గంటల్లోనే రూ. 5.64 లక్షలను లాభంగా పొందాడు. రాత్రి 8 గంటల సమయంలో అతని అకౌంటులోని వేల కోట్ల డబ్బంతా మళ్లీ విత్ డ్రా అయ్యాయి. కానీ ఈ గ్యాపులోనే కొంత డబ్బును సద్వినియోగం చేసుకొని లక్షల డబ్బు సంపాదించుకోవడంతో రమేష్ తెలివిని ప్రశంసిస్తున్నారు. స్థానికంగా ఈ విషయం గురించి చర్చించుకుంటున్నారు. మీకూ ఇలాంటి సంఘటన ఎదురైతే విచ్చలవిడిగా ఖర్చు పెట్టకుండా తెలివిగా సంపాదించుకోమని రమేష్ సలహా ఇస్తున్నాడు.