వర్మకు నోటీసులు.. స్పందించకపోతే అరెస్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

వర్మకు నోటీసులు.. స్పందించకపోతే అరెస్ట్

February 2, 2018

వివాదాస్పద సినీదర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తీసిన చిన్న శృంగార చిత్రం ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’(జీఎస్టీ) వివాదం పోలీసులకు చేరింది. ఇది అశ్లీలంగా ఉందని, యువత దీన్ని చూస్తే చెడిపోతారని ఫిర్యాదులు రావడంతో వర్మపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు సైబర్ క్రైమ్ అదనపు డీసీపీ రఘువీర్ వెల్లడించారు.ఈ ఫిర్యాదుపై విచారణకు రావాలని వర్మకు నోటీసులు పంపామని, ఆయన స్పందించకపోతే అరెస్ట్ చేస్తామని చెప్పారు. వర్మ జీఎస్టీపై పలు వివాదాలు ముసరడం తెలిసిందే. ఆయన అశ్లీల చిత్రాలను ప్రోత్సహిస్తున్నారని పలువురు మహిళా సంఘాల నాయకురాళ్లు మండిపడున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసుల ఆదేశాలపై.. జీఎస్టీని ఉచితంగా చూపిస్తున్న విమియో వెబ్‌సైట్ ఆ సౌకర్యాన్ని రద్దు చేసింది. అయితే డబ్బు కట్టి చూసే అవకాశం ఇప్పటికీ ఉంది. వీడియోను అమెరికాలో విడుదల చేయడంతో డబ్బులు కట్టి చూసే సౌకర్యాన్ని రద్దు చేసే అవకాశం లేనట్లు తెలుస్తోంది. అమెరికన్ పోర్న్ నటి మియా మాల్కోవాతో తీసిన జీఎస్టీకి కీరవాణి సంగీతం సమకూర్చడం తెలిసిందే.