ఈ చంద్రబాబును పట్టిస్తే లక్ష రివార్డ్.. ఆర్జీవీ - MicTv.in - Telugu News
mictv telugu

ఈ చంద్రబాబును పట్టిస్తే లక్ష రివార్డ్.. ఆర్జీవీ

October 13, 2018

మనుషులను పోలిన మనుషులు ప్రపంచంలో ఏడుగురు ఉంటారంటారు. మోదీని పోలిన నకిలీ మోదీలు సోషల్ మీడియాలో తరచూ హల్ చల్ చేస్తుంటారు. వారిలో ఒకర్ని మోదీ తమ్ముడని, ఆటో రిక్షా డ్రైవరని త్రిపుర సీఎం బిప్లవ్ దేవ్ పొరబడ్డారు కూడా. మోదీ సంగతి వదిలేస్తే.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును పోలిన ఓ వ్యక్తి కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాడు.Ramgopal Varma announced one lakh rupees on fake Chandrababu Can somebody help me track this man?..There will be a reward of 1 lak to anyone who can make him get in touch with meఅతడు హోటల్లో కస్టబర్లకు చట్నీ వడ్డిస్తూ కెమెరాకు దొరికాడు. అచ్చం బాబును పోలిన గడ్డం, తలకట్టు, శరీరంతో నిజమైన చంద్రబాబే అన్నట్టున్నాడు. కొందరైతే అతణ్ని తిత్లీ తుఫాను బాధితులకు భోజనం వడ్డిస్తున్న సీఎంగా పొరబడ్డారు కూడా. దీనిపై సినీ దర్శకుడు ఆర్జీవీ కూడా స్పదించాడు. వ్యక్తిని వెతికి పట్టుకోవటంలో నాకు ఎవరైనా చేస్తారా? అతణ్ని నాకు టచ్‌లోకి తీసుకువచ్చిన వారికి లక్ష రూపాయల నజరానా ఇస్తా…’ అని ప్రకటించాడే. ఫేక్ చంద్రబాబు వీడియోను ట్విటర్లో పెట్టాడు. ‘ఆఫీసర్’ మూవీ బోల్తా పడ్డాక ఆర్టీవీ సోషల్  మీడియాలో కనిపంచడం లేదు. తాజాగా లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ షూటింగును దసరా రోజు ప్రారంభిస్తానంటూ మళ్లీ హల్ చల్ చేస్తున్నాడు.