వర్మ బయోపిక్.. హీరో, దర్శకుడూ రెండూ ఇతడే..  - MicTv.in - Telugu News
mictv telugu

వర్మ బయోపిక్.. హీరో, దర్శకుడూ రెండూ ఇతడే.. 

September 16, 2020

Ramgopal varma biopic hero director revealed rgv movies dorasai teja

బయోపిక్ అంటే గొప్ప నాయకులదే కావాల్సిన అవసరం లేదంటున్నాడు వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ. తెలుగు సినిమాలు, రాజకీయాలు కలగలసి బయోపిక్‌కు అర్థాలు మారిపోయిన నేపథ్యంలో అతన తన బయోపిక్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులో తన పాత్ర పోషించే నటుణ్ని ఆయన పరిచయం చేశాడు. అతని పేరు దొరసాయి తేజ అని, తన తల్లి నుంచి ఆశీర్వాదం తీసుకుంటున్నాడని వర్మ ఓ ఫొటోను ట్వీట్ చేశాడు. ఈ చిత్రానికి దర్శకుడు కూడా తేజనే కావడం విశేషం. షూటింగ్ కూడా మొదలైపోయింది. వర్మ తల్లి సూర్యావతి కెమెరా స్విచాన్ చేయగా, సోదరి విజయ క్లాప్ కొట్టారు. 

తొలిసారి మెగాఫోన్ పట్టుకోబోతున్న సాయి.. వర్మ బయోపిక్ పార్ట్ వన్‌లో అతని కాలేజీ రోజులను చూపిస్తాడట. కుర్ర వర్మగా నటిస్తున్న తేజ.. రెండో పార్ట్‌లో ఉండకపోవచ్చని భావిస్తున్నారు. కాస్త వయసు మళ్లిన నటుడు వర్మ2 పాత్ర పోషించే అకాశముంది. పార్ట్ 3లో వర్మే హీరోగా నటించనున్నాడు. 

‘శివ’ చిత్రంతో టాలీవుడ్‌ను మలుపు తిప్పిన వర్మ బాలీవుడ్‌లో అడుగుపెట్టి సంచలన చిత్రాలు రూపొదించడం తెలిసిందే. అటు సినిమా పడవపై, ఇటు రాజకీయ విమర్శల పడవపై ప్రయాణించే వర్మ కొన్నాళ్లు పూర్తి దృష్టిని తెలుగు రాష్ర్టాలపైనే పెట్టాడు. ఒక పక్క అడల్ట్ కంటెంట్ సినిమాలు, మరోపక్క.. ‘మర్డర్’, ‘పవర్ స్టార్’ వంటి  లాంటి లోకల్ సోషల్, మసాలా చిత్రాలతో కలకలం రుపుతున్నాడు. పవర్ స్టార్‌కు కౌంటర్‌గా అతని శత్రువులు ‘పరాన్నజీవి’ తీయడం తెలిసిందే. దీనికి కౌంటర్‌గానే వర్మ తన బయోపిక్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.