వర్మ సినిమాను కత్తిరించాల్సిందే..రివైజింగ్ కమిటీ - MicTv.in - Telugu News
mictv telugu

వర్మ సినిమాను కత్తిరించాల్సిందే..రివైజింగ్ కమిటీ

December 7, 2019

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన ‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాకు రివైజింగ్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెన్సార్ బోర్డ్ ఈ సినిమాను చూసి సర్టిఫికేట్ ఇవ్వలేమని చెప్పిన సంగతి తెల్సిందే. దీంతో చిత్రబృందం రివైజింగ్ కమిటీని ఆశ్రయించింది. రివైజింగ్ కమిటీ ఈ సినిమాకు కొన్ని కట్స్ సూచించి.. యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. 

దీంతో ‘అమ్మరాజ్యంలో కడపబిడ్డలు’ డిసెంబర్ 12న విడుదల కానుంది. ఈ సినిమాకు వర్మ తొలుత ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ అని టైటిల్ పెట్టాడు. దీనిపై వివాదం నెలకొనడంతో టైటిల్ మార్చాడు. అయినా కూడా సెన్సార్ బోర్డు ఒప్పుకోకపోవడంతో రివైజింగ్ కమిటీని ఆశ్రయించాడు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.