కీరవాణికి ‘జీఎస్టీ’ చిక్కులు..  విచారించనున్న పోలీసులు.. - MicTv.in - Telugu News
mictv telugu

కీరవాణికి ‘జీఎస్టీ’ చిక్కులు..  విచారించనున్న పోలీసులు..

February 20, 2018

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ అడల్ట్ మూవీ తీసి తనతోపాటు, మూవీ టీమ్‌ను కూడా ఇబ్బందుల్లో పడేశాడు. దీనికి సంగీతం అందించిన ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణిని కూడా పోలీసులు విచారించనున్నారు. అతనికి నోటీసులు పంపుతున్నామని, త్వరలోనే విచారిస్తామని హైదరాబాద్ పోలీసులు చెప్పారు.

వర్మ జీఎస్టీతో తమకు అభ్యంతరం లేని, అయితే ఆ బూతు సినిమాలకు భారతీయ సంప్రదాయ సంగీతాన్ని అందించి కీరవాణి ఘోర తప్పిదం చేశారని కొందరు విరుచుకుపడుతున్నారు. అసలు జీఎస్టీలో నగ్నంగా కనిపించిన అమెరికా పోర్న్ స్టార్ మియా మాల్కోవాతోపాటు ఆ టీఎంలోని అందర్నీ హైదరాబాద్ కు పట్టుకొచ్చి విచారణ జరిపించాలని కొన్ని హిందూ, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే సాంకేతికంగా అది అసాధ్యం. వర్మను విచారించిన పోలీసులు తదుపరి కీరవాణిని, అసిస్టెంట్ డైరెక్టరును, కెమెరామెన్ ఇతర సాంకేతిక నిపుణులనీ విచారించే అవకాశముందంటున్నారు. జీఎస్టీకి తాను తీయలేదని వర్మ చెప్పినట్లు వార్తలు రావడం తెలిసిందే. అయితే అది అబద్ధమని, జీఎస్టీని తానే తీశానని వర్మ స్పష్టం చేశాడు.