జీఎస్టీ పార్ట్ 2 తీస్తున్నా.. దేవుడు కరుణిస్తాడు.. - MicTv.in - Telugu News
mictv telugu

జీఎస్టీ పార్ట్ 2 తీస్తున్నా.. దేవుడు కరుణిస్తాడు..

January 30, 2018

గాడ్, సెక్స్ అండ్ ట్రూత్(జీఎస్టీ)తో తేనెతుట్టె కదిల్చిన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏమాత్రం వెనక్కితగ్గడం లేదు. భారతీయ సంస్కృతిని భ్రష్టుపట్టిస్తున్నావని, నువ్వో సైకోవు అని తిడుతున్నా లైట్ తీసుకుంటున్నాడు. ఇష్టం లేకపోతే నా మూవీలు చూడకండి అని మొఖం మీద గుద్ది చెబుతున్నాడు.

అమెరికన్ పోర్న్ నటి మియా మాల్కోవాతో తీసిన జీఎస్టీకి చక్కని స్పందన వచ్చిందని చెబుతున్న వర్మ మరో బాంబు పేల్చాడు. త్వరలోనే జీఎస్టీ పార్ట్ 2 మొదలు పెడతున్నానని ట్వీట్ చేశాడు. దేవుడు,  తన జీఎస్టీ ప్రేమికులు తనకు మద్దతు తెలుపుతారని ఆశిస్తున్నానన్నారు.మియా మాల్కోవా జీఎస్టీ కీరవాణి సంగీతంతో ఈ నెల 27న విడుదలైన సంగతి తెలిసిందే. చాలామంది దీన్ని మెచ్చుకుంటున్నారని వర్మ చెబుతోంటే, అదేమంతి గొప్ప మూవీ కాదని, అందులో ఆడమనిషిని మాంసపు ముద్దలా చూపారని మహిళా సంఘాలు చెబుతున్నాయి.