20న నాగ్‌-వర్మ మూవీ షురూ - MicTv.in - Telugu News
mictv telugu

20న నాగ్‌-వర్మ మూవీ షురూ

November 1, 2017

నాగార్జునతో సినిమా తీస్తున్నానని రాంగోపాల్ వర్మ ఇదివరకు ప్రకటించడం తెలిసిందే. అయితే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ వివాదంలో తీరికలేకుండా ఉన్న వర్మ.. నాగ్ మూవీని ఇప్పట్లో తీయలేరని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వీటికి తెరదించుతూ వర్మ బుధవారం ఎప్పట్లాగే ఫేస్బుక్ లో ప్రకటన చేశారు. ‘నవంబర్‌ 20 నుంచి అక్కినేని నాగార్జున సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలు కానుంది . నాగ్‌తో శివ సినిమాను మొదలుపెట్టిన అన్నపూర్ణ స్టూడియోస్ లోనే షూటింగ్ మొదలవుతుంది. చాలా భావోద్వేగానికి గురవుతున్నాను’  అని చెప్పారు. శివ2 పేరుతో తీస్తారని భావిస్తున్న ఈ మూవీ ఏప్రిల్ లో విడుదల కానుంది. లక్ష్మీస్ ఎన్టీఆయర్ మూవీని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మొదలెట్టి అక్టోబర్ నెలలో విడుదల చేస్తానని వర్మ ప్రకటించడం తెలిసిందే. అంటే నాగ్ మూవీలో ఆయన చాలా త్వరలోనే పూర్తి చేస్తున్నట్ల లెక్క.