కేసీఆర్, మహేశ్.. వీపు సుందరులంట! - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్, మహేశ్.. వీపు సుందరులంట!

October 30, 2017

రాంగోపాల్ వర్మ తీస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ వివాదానికి కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి తీస్తున్న ‘లక్ష్మీస్ వీరంగ్రంథం’ గొడవ తోడై ముదిరి మరింత పాకాన పడింది. తన సినిమాకు కౌంటర్ గా తీస్తున్న ‘..వీరగ్రంథం’పై ఆర్జీవీ తనదైన శైలిలో సటైర్లు వేస్తున్నాడు. ఇప్పటికీ ‘వీపు సుందరి’ ఫొటో పోస్ట్ చేసిన వర్మ తాజాగా మళ్లీ దీనిపై స్పందించాడు.

తన ఫొటోతోపాటు తెలంగాణ సీఎం కేసీఆర్, ఎన్టీయార్, మహేశ్ బాబు, కేతిరెడ్డిల ఫొటోలను ‘వీపు సందరి’ పోస్టర్‌పై అంటించి ఫేస్ బుక్‌లో పోస్టు పెట్టాడు. అంతటితో వూరుకోకుండా.. దానికి వివరణ కూడా ఇచ్చాడు.. ‘కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డిగారికి తెలంగాణ చీఫ్ మినిస్టర్ కెసిఆర్ గారి కన్న 100 రెట్లు ఎక్కువ ఎక్సట్రార్డినరీ స్క్రీన్ ప్రెజన్స్ వుంది ..కేతిరెడ్డిని చూసాడంటే మహేష్ బాబు కూడా కుళ్ళుతో చచ్చిపోతాడు ..లక్ష్మి’స్ వీరగ్రంధంలో వీరగంధం పాత్ర తను వేస్తే బ్లాక్ బస్టర్ గారంటీ .. కేతినేని హీరోగా వీరగంధం పాత్ర మరియు హీరోయిన్‌గా ఒక సెక్సీ వీపు .. వావ్!! సూపరో సూపరు.. నందమూరి తారకరామారావు గారు స్వర్గం నుంచి ఒక లారీ లోడ్ అక్షింతలు కేతిరెడ్డి నెత్తి మీద చల్లడం ఖాయం’’ అని పోస్టులో రాశాడు.