రేవంత్ కాంగ్రెస్ బాహుబలి: వర్మ - MicTv.in - Telugu News
mictv telugu

రేవంత్ కాంగ్రెస్ బాహుబలి: వర్మ

October 30, 2017

టీడీపీకి గుడ్‌బై చెప్పేసి కాంగ్రెస్‌లో చేరడం తనకు చాలా సంతోషం కలిగిస్తోందని సినీదర్శకుడు రాంగోపాల్ వర్మ సోమవారం ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టాడు.

 రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బాహుబలి అని కొనియాడారు. ‘రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం నాకు చాలా చాలా హ్యాపీ. రేవంత్ రెడ్డి చేరటం మూలాన నాకు కాంగ్రెస్ పార్టీ మీద మళ్ళీ నమ్మకం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఫిల్మ్ థియేటర్ అయితే రేవంత్ రెడ్డి బాహుబలి . బాహుబలి బాక్సాఫీస్‌కి నోట్ల వర్షం కురిపిస్తే రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌కి ఓట్ల వర్షం కురిపిస్తాడు..’ అని వర్మ పేర్కొన్నాడు. టీడీపీతో ఇటీవల తరచూ గొడవ పెట్టుకుంటున్న వర్మకు.. రేవంత్ ఆ పార్టీ నుంచి బయటికి రావడం సహజంగానే సంతోషం కలిగించే విషయం కదా.