మునుగోడుపై బాంబులు వేస్తున్నారు.. పారిపోండి - MicTv.in - Telugu News
mictv telugu

మునుగోడుపై బాంబులు వేస్తున్నారు.. పారిపోండి

November 6, 2022

ఉత్కంఠభరితంగా సాగిన మునుగోడు ఉప ఎన్నిక తంతు ముగిసింది. టీఆర్ఎస్ అభ్యర్ధి పదివేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. అలాగే ఈ ఎన్నికలో పలువురు అభ్యర్ధులు పోటీపడ్డారు. అందులో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ ఒకరు. సీరియస్‌గా సాగుతున్న ప్రచార తంతులో పాల్ తనదైన కామెడీతో నవ్వులు పూయించారు. తన హావభావాలు, వ్యాఖ్యలతో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. వెయ్యికి తక్కవ ఓట్లు వచ్చినా బ్యాలెట్ పేపర్లు ఉండి ఉంటే లక్షకు పైగా ఓట్లు వచ్చేవని ఫలితాల అనంతరం తనకు మాత్రమే సొంతమైన శైలిలో వ్యాఖ్యానించారు.

 

 

 

అయితే గతంలో మునుగోడులో తనను గెలిపించకపోతే మునుగోడును బాంబు వేసి పేల్చేస్తానని పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫలితాలు వచ్చేశాక ఈ వ్యాఖ్యలపై రాంగోపాల్ వర్మ ఆసక్తికర ట్వీట్లు చేశారు. ‘ఇప్పుడే కేఏపాల్ తన స్నేహితులైన ఐసిస్, అల్ ఖాయిదా సాయంతో మునుగోడుపై బాంబులు వేస్తున్నారని తెలిసింది. అక్కడి వారు వెంటనే పారిపోవాలి. అంతేకాక, తన శక్తిని ఉపయోగించి ప్రభువు సాయంతో మునుగోడులో ఎలాంటి పంటలు పండకుండా చేయాలి. దారుణమైన వైరస్ వచ్చి అక్కడి మనుషులు చచ్చిపోయేలా పాల్ చేయబోతున్నాడ’ని సెటైర్ వేశారు. అంతేనా.. ‘ఇక కేఏ పాల్ అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేయడం బెటర్. అక్కడ గెలిచిన తర్వాత మునుగోడుపై ఓ అణుబాంబు వేస్తాడు’ అని వర్మ పోస్ట్ చేశారు. ఈ ఫన్నీ ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.