ఊహించినట్టుగానే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మెన్ రమీజ్ రాజాపై వేటు పడింది. స్వదేశంలో ఇంగ్లండ్‌పై మూడు టెస్టులు ఓటమి కారణంగా రమీజ్ రాజాను సాగనంపారు. అతని స్థానంలో నజమ్ సేథిని కొత్త చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నాడు. అయితే అధికారకంగా ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. ఇంగ్లండ్‌తో మూడు టెస్ట్‌ల సిరీస్‌కు సరైన పిచ్‌లను కూడా తయారు చేయలేకపోయాడని రమీజ్ రాజాపై తీవ్ర విమర్శలు వచ్చాయి .0-3తో సిరీస్ కోల్పోవడంతో కెప్టెన్సీ నుంచి బాబర్ అజాంను, చైర్మన్ పదవి నుంచి రమీజ్ రాజాను తప్పించాలని డిమాండ్లు వ్యక్తమయ్యాయి. పీసీబీ చైర్మన్ తీరు పట్ల పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ అసంతృప్తిగా ఉండటం, సెక్యూరిటీ విషయంలో గొడవ జరగడం.. బాబర్ ఆజామ్ నిరసన వ్యక్తం చేయడం వంటి అంశాలు అతని పదవిపై ప్రభావం చూపాయి. దాంతో పాటు భారత్‌ను తిట్టి సానుభూతి పొందాలన్న రమీజ్ రాజా ప్లాన్ కూడా బెడిసి కొట్టింది. భారత్‌తో క్రికెట్ మ్యాచ్‌లు వంటి సున్నితమైన అంశాలపై పదే పదే మాట్లాడుతూ.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం పీసీబీ పెద్దలకు ఆగ్రహం తెప్పించింది.