రంజాన్ ఆఫర్.. 25 శాతం డిస్కౌంట్: సజ్జనార్ - MicTv.in - Telugu News
mictv telugu

రంజాన్ ఆఫర్.. 25 శాతం డిస్కౌంట్: సజ్జనార్

April 25, 2022

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రంజాన్ పండుగ సందర్భంగా ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. కార్గో సర్వీసు ఛార్జీలపై 25 శాతం డిస్కౌంట్ అందిస్తున్నామని.. ఎండీ వీసీ సజ్జనార్ ప్రకటించారు.

తెలంగాణలోని ఆర్టీసీని గాడిన పెట్టే పనిలో ఎండీ సజ్జనార్ వినూత్న పథకాలు ప్రవేశపెడుతున్నారు. ప్రతీ పండగ సందర్భంగా కొత్త కొత్త డిస్కౌంట్లను ప్రవేశపెడుతున్నారు. తాజాగా రంజాన్ మాసం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సజ్జనార్ తెలిపారు. ఈ కార్గో సర్వీసు ఛార్జీలు ఈ నెల 24 నుంచి మే 3 వరకు అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు.

ఈ ఆఫర్‌‌లో భాగంగా 5 కేజీల వరకు మాత్రమే ఈడిస్కౌంట్ వర్తిస్తుందని, ప్రయాణికులు మరిన్ని వివరాలకు 040-30102829, 68153333 నంబర్లను సంప్రదించాలని ఆయన సోమవారం ట్వీట్ చేశారు. ఇప్పటికే టీ 24 టికెట్ ద్వారా 24 గంటలపాటు లీటర్ పెట్రోల్ కంటే తక్కువ ధర 100 రూపాయలకే ఆర్టీసీ బస్సుల్లో 24గంటలపాటు హైదరాబాద్‌లో ప్రయాణించే అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో ఆఫర్‌ను ప్రకటించారు.