రాష్ట్రపతి క్షమాపణ చెప్పాల్సిందే.. లేకపోతే రానివ్వం..   - MicTv.in - Telugu News
mictv telugu

రాష్ట్రపతి క్షమాపణ చెప్పాల్సిందే.. లేకపోతే రానివ్వం..  

March 1, 2018

ఇస్లాం, క్రైస్తవ మతాలు ఈ దేశానికి పరాయి మతాలని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ గతంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడాయన మెడుకు చుట్టుకున్నాయి. ఈ అనుచిత వ్యాఖ్యలకు ఆయన క్షమాపణ చెప్పాలని, లేకపోతే స్నాతకోత్సవానికి అనుమతించబోమని యూపీలోని అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం (ఏఎంయూ) విద్యార్థులు భీష్మించారు.

కోవింద్ వ్యాఖ్యలు ఈ దేశాన్ని చీల్చేలా ఉన్నాయి కనుక ఆయన క్షమాపణ చెప్పాల్సిందేనని ఏఎంయూ విద్యార్థి సంఘం ఉపాధ్యక్షుడు సజ్జాద్ సుభాన్ డిమాండ్ చేస్తున్నాడు. తమ డిమాండ్ ను కాదని, రాష్ట్రపతి వస్తే తర్వాత తలెత్తే పరిస్థితులకు ఆయనది, వీసేదే బాధ్యత అని హెచ్చరించాడు.

ఏఎంయూ స్నాతకోత్సవం ఈ నెల 7న జరగనుంది. రాష్ట్రపతి ఇందులో పాల్గొనాల్సి ఉంది. 2010లో కోవింద్ బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్నప్పుడు పై వ్యాఖ్యలు చేశారు.  షెడ్యూల్డు కులాల కేటగిరీలో ముస్లింలు, క్రైస్తవులను చేర్చడం రాజ్యాంగ విరుద్ధమని, కనుక 0కమిషన్ సిఫార్సులను అమలు చేయకూడదని అన్నారు. మరి సిక్కులను ఎస్సీల్లో చేర్చారు కదా అని విలేకర్లు ప్రశ్నించగా..‘సిక్కులు మనోళ్లే, భారతీయులు. కానీ ఇస్లాం,  క్రైస్తవం మనకు పరాయి మతాలు’ అని అన్నారు.