మెజార్టీ ఓట్లు కోవింద్ కే... అయినా గెలుపు మీరాదే... - MicTv.in - Telugu News
mictv telugu

మెజార్టీ ఓట్లు కోవింద్ కే… అయినా గెలుపు మీరాదే…

June 24, 2017

ఇప్పటికైతే రాష్ట్రపతి అభ్యర్థిగా గెల్వడానికి రామ్ నాథ్ కోవింద్ కే అవకాశాలు పుష్కలంగా ఉన్నవి. ఎన్డీఏ పార్టీల బలం కూడా సరీపోతుంది. అయితే ఏమో… గుర్రం ఎగరావచ్చూ అన్నట్లు విపక్షాల అభ్యర్థి మీరా కుమార్ గెల్చినా గెల్వవా వచ్చు అనే టాక్ కూడా ఉంది. రాష్ట్రపతి అభ్యర్థుల విషయంలో రెండు ప్రధాన పార్టీలు వ్యూహాం ప్రకారం ప్రకటించాయి. ముందుగా బిజెపి దళిత అభ్యర్థి అని ప్రకటించి కాంగ్రెస్ దాని మిత్ర పక్షాలకు గట్టి సవాలు విసిరింది. దాన్ని  విపక్షాలు చాలా ఈజీగా తిప్పి కొట్టాయి.

నామినేషన్ల పర్వ కూడా స్టార్ట్ అయింది. జూలై 17న రాష్ట్రపతి  ఎన్నిక జరుగుతుంది. ఎన్డీఎలోని కూటమిలున్న పార్టీల ఓట్లును చూసుకుంటే కోవిందుడే గెలుస్తాడు. 50 శాతానికి మించి ఓట్లు ఉండాలి. అయితే మీరా కూమార్ ను బలపరుస్తున్న  పార్టీలు ఓట్లు 40 శాతం వరకు ఉన్నాయి. మూడో ఫ్రంట్ కు సంబంధించిన  పార్టీల ఓట్లు 10 శాతం వరకు  ఉన్నాయి. ఈ లెక్కన చూసుకుంటే బిజెపి  అభ్యర్థికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈజీగా బయట పడే ఛాన్స్ ఉంది.

ఇద్దరి  అభ్యర్థల చదువులు, పుట్టిన యేడాదులు అంతా ఒకే  అయినప్పటికీ  వారి కుటుంబ రాజకీయాలు,  జనంలో ఉన్న పలుకుబడి, మీరా కుమార్ దళిత మహిళ కావడం… వీరు జన ఉద్యమాల కుటుంబాల నుండి రావడం ఇవన్నీ కూడా ఈమెకు కల్సి వచ్చే  అవకాశం ఉంది. మూడో ఫ్రంట్ లో ఉన్న పార్టీలు టిఆర్ఎస్, వైసీపీలు ఇంకా చిన్న చితాక పార్టీలున్నవి. వీళ్లు ఇటు వైపు కాస్త జరిగితే గనుక బిజెపికి కష్టమే.  ఎన్నికలకు ఇంకా  మూడు వారాల గడువు ఉంది. ఈ లోపు ఏవైనా జరుగ రాని  పరిణామాలు జరిగితే గనుక ఖచ్చితంగా మీరాకే అనుకూలంగా ఉంటుంది.

ఇందిరా గాంధీ హాయంలోనే ఆత్మప్రబోధాను సారం ఓట్లు వేయాలనే చరిత్ర ఉంది.  నీలం  సంజీవరెడ్డికి  ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ మద్దతునిచ్చినా కూడా వి.వి. గిరి రాష్ట్రపతి అయ్యారు. ఇందిరాగాంధీ అప్పటికే బలమైన నాయకులు… ఆమె మాటకు తిరుగు లేదు. ఆమె వి.వి. గిరికి మద్దతునిచ్చారు. ఎంఎల్యేలు, ఎంపిలు ఆత్మప్రబోధాను సారం  ఓటు వేయాలని చెప్పారు. అంతిమంగా  వి.వి.గిరి రాష్ట్రపతి అయ్యారు.

మరీప్పుడు చరిత్ర పునరావృతం అవుతుందా.. అంటే మోదీ బలమైన నాయకుడే…. ఆయనకు పార్టీలో తిరుగు లేదు. మరీ ఒంటెత్తు పోకడలే… నచ్చక పార్టీలో చిచ్చు పెట్టినా….ఎన్డీకు మద్దతునిస్తున్న పార్టీలు ఓట్లు విపక్షాల వైపు మళ్లించినా ఖచ్చితంగా మీరా గెలిచి తీరుతుంది. 17 పార్టీల మద్దతుతో ఉన్న మీరాకు ఎన్డీఎ, యూపిఎ కూటముల్లో లేని పార్టీల మద్దతే కీలకం. వీరు గనుక మద్దతునిస్తే ఖచ్చితంగా మీరాకుమార్ రాష్ట్రపతి కావడం ఖాయం. ఏం జరుగుతుందో తేలడానికి వచ్చే నెల20 దాకా ఆగాల్సిందే. ఏమో మరి గుర్రం ఎగరవచ్చేమో ఎవరికి తెల్సు.