50వ పుట్టినరోజు జరుపుకున్న శివగామి - MicTv.in - Telugu News
mictv telugu

50వ పుట్టినరోజు జరుపుకున్న శివగామి

September 15, 2020

90వ దశకంలో టాలీవుడ్‌లో కథానాయికగా ఓ వెలుగు వెలిగిన రమ్యకృష్ణ సెకెండ్ ఇన్నింగ్స్‌లో కూడా ఆమె తన హవా కొనసాగిస్తున్నారు. హీరోయిన్‌గా ఉన్నప్పుడు ‘నరసింహా’ సినిమాలో చేసిన నీలాంబరి పాత్ర, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారాక ‘బాహుబలి’ సినిమాలో ఆమె పోషించిన శివగామి పాత్రలు ఆమెకు చిరస్థాయిగా నిలిచే కీర్తిని తెచ్చిపెట్టాయి. వందల సినిమాల్లో నటించిన రమ్యకృష్ణ 50వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆమె కుటుంబ సభ్యుల నడుమ కేక్ కట్ చేశారు. 

 భర్త కృష్ణవంశీ, పిల్లలు ఇతర కుటుంబసభ్యుల సమక్షంలో కేక్ కట్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ‘అద్బుతమైన 5 పదుల వయస్సు’ అని పేర్కొన్నారు. ఆ పోస్టును చూసి ఆమె అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. మీరు ఇంకా సినిమాల్లో పవర్ ఫుల్ పాత్రలు పోషించి ప్రేక్షకులను రంజింపజేయాలని కోరుతున్నారు. కాగా, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నటి జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘క్వీన్’ వెబ్ ఫిలింలో రమ్యకృష్ణ ముఖ్యపాత్రలో నటించిన విషయం తెలిసిందే. గౌతమ్ వాసుదేవమీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ  వెబ్ ఫిలింకు సీక్వెల్ రానుంది.