జయగా అదరగొట్టిన రమ్యకృష్ణ.. క్వీన్ ట్రైలర్.. - MicTv.in - Telugu News
mictv telugu

జయగా అదరగొట్టిన రమ్యకృష్ణ.. క్వీన్ ట్రైలర్..

December 5, 2019

Ramya Krishnan.

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితపై ఇప్పుడు మూడు బయోపిక్స్ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇందులో కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘తలైవి’ చిత్రం. ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదల అయిన విషయం తెలిసిందే. అయితే సినిమాల విషయం అటుంచితే.. జయలలిత జీవితంపై ఓ వెబ్‌సిరీస్ కూడా రోపొందుతోంది. రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో గౌతమ్ మీనన్, మురుగేషన్‌ దర్శకత్వంలో ‘క్వీన్’ వెబ్‌సిరీస్ తెరకెక్కుతోంది. మొత్తం 14 ఎపిసోడ్స్ ఇందులో ఉంటాయి. తాజాగా ఈ వెబ్‌సిరీస్ టీజర్ విడుదలైంది. ఇది చూసిన తర్వాత సినిమాకు ఏ మాత్రం తక్కువ కాదని అర్థమవుతోంది.

జయ చిన్ననాటి జీవితం నుంచి మొదలుపెట్టి.. ఆమె స్కూల్ జీవితం.. ఎదిగిన విధానం.. ఆ తర్వాత సినిమాలు.. ఎంజీఆర్‌తో పరిచయం.. సినిమాల్లో స్టార్‌డమ్.. ఆయన మరణం తర్వాత పార్టీ పగ్గాలు తీసుకున్న విధానం.. ఇలా అన్నీ అంశాలు ఇందులో చూపించాడు గౌతమ్. త్వరలోనే ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది.