వరసలు కలుపుతున్న సమంత ! - MicTv.in - Telugu News
mictv telugu

వరసలు కలుపుతున్న సమంత !

August 9, 2017

11 ఆగస్టుకు రిలీజ్ అవుతున్న ‘ నేనే రాజు నేనే మంత్రి ’ సినిమాలో రాణా కటౌట్ గురించి ట్విట్టర్ లో పోస్టు చేసింది సమంత. ‘ అదిగో నా సూపర్ స్టార్ అన్నయ్య, నేనే రాజు నేనే మంత్రి ఫస్ట్ డే, ఫస్ట్ షో, ఆగస్టు 11 ’ అని ట్యాగ్ లైన్ కూడా పెట్టింది. చిత్ర ప్రమోషన్ లో భాగంగా రోడ్డు పక్కన రాణా భారీ కటౌట్ పెట్టడంతో సమంత తన ఆనందాన్ని తన ఫ్యాన్స్ తో ఇలా పంచుకుందన్నమాట. త్వరలో అక్కినేని వారింటి కోడలు కానున్న సమంత అప్పుడే వరసలు కలుపుకుంటోంది. నాగచైతన్యకు రాణా మేనమామ కొడుకు అంటే బావ వరస అవుతాడు. చైతూ మిస్సెస్ అవుతున్న సమంతకు రాణా అన్నయ్య వరస అవుతాడని ఇలా సూపర్ స్టార్ అన్నయ్య అని సమంత పోస్టు పెట్టడం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.