రానా దగ్గుబాటి, మిహీకాల పెళ్లి..ఎప్పుడంటే! - MicTv.in - Telugu News
mictv telugu

రానా దగ్గుబాటి, మిహీకాల పెళ్లి..ఎప్పుడంటే!

May 31, 2020

 

vnghf

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో ఒకరైన రానా దగ్గుబాటి పెళ్లి గురించి సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేసిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ కి చెందిన మిహీకా బజాజ్ అనే అమ్మాయితో తానూ ప్రేమలో ఉన్నట్టు..ఆమె పెళ్ళికి ఒప్పుకుందని రానా ఇటీవల తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో వాళ్లిద్దరూ ఉన్న ఫోటోను పోస్ట్ చేశాడు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మిహీకా బజాజ్‌ వృత్తి రీత్యా ఈవెంట్ మేనేజర్. ఆమె ‘డ్యూ డ్రాప్‌ స్టూడియో’ అనే ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీని నిర్వహిస్తున్నారు. 

మిహీక కుటుంబం సంప్రదాయం ప్రకారం మే 21న రోకా వేడుకను నిర్వహించారు. ఇక మరి కొద్ది రోజులలో నిశ్చితార్ధం జరపనున్నారని సమాచారం. అలాగే ఆగస్ట్‌ నెలలో వీరిద్దరికి పేలి చేయాలని ఇరువురు కుటుంబ సభ్యులు నిర్ణయించారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి రానా తండ్రి సురేష్ బాబు అన్ని ఏర్పాట్లు చకా చకా చేస్తున్నారట. కరోనా నేపథ్యంలో హైదరాబాద్‌లోనే కొద్ది మంది బంధువులు, సన్నిహితలు సమక్షంలో రానా, మిహీకాల వివాహం జరగనున్నట్టు తెలుస్తుంది.