Rana Daggubati and Sai Pallavi's Virata Parvam gets an official release date
mictv telugu

విరాటపర్వం విడుదల తేదీ వచ్చేసింది…

May 6, 2022

వర్సటైల్ యాక్టర్ రానా దగ్గుబాటి, నేచురల్ బ్యూటీ సాయిపల్లవి ప్రధాన పాత్రలో నక్సల్స్ బ్యాగ్రౌండ్‌లో వస్తోన్న చిత్రం విరాటపర్వం. వేణు ఊడుగుల దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా.. గతేడాదే విడుదలకావాల్సి ఉంది. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదలను వాయిదా వేసింది చిత్రబృందం. ఈ నేపథ్యంలో సినిమాను ఓటీటీలో విడుదల చేయాలనీ అనుకున్నారని టాక్ వచ్చింది. అయితే వాటన్నింటికి చెక్‌ పెడుతూ ఈ మూవీ విడుదల తేదీని తాజాగా ప్రకటించింది చిత్ర బృందం.

ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీని జులై 1న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్‌ సోషల్‌ మీడియా వేదికగా తెలిపింది. ఈ సినిమాలో రానా కామ్రేడ్‌ రవన్నగా నటిస్తుండగా.. సాయి పల్లవి అతని ప్రియురాలిగా కనిపించనుంది. ప్రియమణి మరో ముఖ్య పాత్రలో కనిపించనుంది. ద‌గ్గుబాటి సురేశ్ బాబు సమర్పణలో సుధాక‌ర్‌ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా నక్సలైట్ ఉద్యమ నేపథ్యంతో తెరకెక్కిన ‘ఆచార్య’ మూవీ బాక్సాఫీసు వద్ద బోల్తా పడిన నేపథ్యంలో ‘విరాటపర్వం’ మూవీకి ప్రేక్షకుల ఆదరణ ఎలా ఉంటుదన్నదానిపై ఆసక్తి నెలకొంది.