Rana Daggubati attends City Civil court in land dispute issue after Court gave notice
mictv telugu

కోర్టుకు హాజరైనా రానా.. 2200 గజాల స్థలం కేసులో..

July 12, 2022

Rana Daggubati attends City Civil court in land dispute issue after Court gave notice

హైదరాబాద్ ఫిలింనగర్ ‌‌లో భూవివాదం కేసులో సినీ హీరో దగ్గుబాటి రానా ఈరోజు నగరంలోని సిటీ సివిల్ కోర్టుకు హాజరయ్యారు. ఫిల్మ్ నగర్‍లోని 2200 గజాల స్థల వివాదంలో కోర్టుకు హాజరుకావాలని సిటీ సివిల్ కోర్ట్ ఫస్ట్ సీనియర్ సివిల్ జడ్జ్ రానాకు నోటీసులు పంపించారు. ఈ క్రమంలో ఆయన కోర్టుకు హజరయ్యారు. 2014 లో ఫిల్మ్ నగర్ ప్రాంతంలోని 2200 గజాల స్థలాన్ని దగ్గుబాటి ఫ్యామిలీ ఓ వ్యక్తికి లీజ్‏కు ఇవ్వగా.. 2016, 2018 లలో ఆ వ్యక్తి లీజ్ ఎగ్రిమెంట్ రెన్యూవల్ చేసినట్టు సమాచారం. అయితే లీజ్ ఎగ్రిమెంట్ కొనసాగుతుండగానే అందులోని 1000 గజాల స్ధలాన్ని దగ్గుబాటి సురేష్ తన కుమారుడు రానాకి రిజిష్ట్రేషన్ చేశారట.

లీజ్ గడువు ముగియక ముందే ఖాళీ చేయాలని తనపై దగ్గుబాటి ఫ్యామిలీ ఒత్తిడి తీసుకువచ్చిందని సదరు వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. ఇంకా లీజు ఎగ్రిమెంట్ ఉండగా స్ధలం ఖాళీ చేయమన్నారని సివిల్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీంతో న్యాయస్దానం రానాకు నోటీసులు జారీ చేయటంతో ఆయన ఈరోజు కోర్టుకు హజరయ్యారు. రానా తరపు న్యాయవాది కోర్టుకు తమ వాదనలు వినిపిస్తున్నారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.