ఇంటివాడైన రానా.. అతిథులు ఇళ్లనుంచే వర్చువల్ వీడియోలో..  - MicTv.in - Telugu News
mictv telugu

ఇంటివాడైన రానా.. అతిథులు ఇళ్లనుంచే వర్చువల్ వీడియోలో.. 

August 9, 2020

కరోనా సమయంలో ఎట్టకేలకు టాలీవుడ్ యంగ్ హీరో  రానా దగ్గుబాటి తన బ్యాచ్‌లర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పాడు. మిహీకా బజాజ్‌ మెడలో మూడు ముళ్లు వేశాడు. కరోనా కారణంగా  అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలోనే శనివారం రాత్రి రామానాయుడు స్టూడియోలో ఈ వేడుకను నిర్వహించారు. ఈ పెళ్లిలో ఓ విశేషం జరిగింది. అది ఏంటంటే..

పెళ్లికి హాజరుకాని వారికోసం దగ్గుబాటి కుటుంబం వినూత్నంగా వర్చువల్‌ రియాలిటీ కిట్లను అందజేసింది. ఆ వివాహాన్ని లైవ్‌లో తిలకించాలంటే ఉన్న చోటు నుంచే ఆ కిట్లను కళ్లకు ధరిస్తే ఆ వేడుకలో ప్రత్యక్షంగా తామున్నట్టే అనుభూతి కలుగుతుంది. కరోనా కారణంగా పెళ్లికి హాజరు కాని వారికి దగ్గుబాటి కుటుంబం తమ బంధుమిత్రులకు ఈ వెసలుబాటు కల్పించింది. 

ప్రత్యక్షంగా పెళ్లికి హాజరైనా వారిలో రామ్‌చరణ్‌, ఉపాసన దంపతులు, అక్కినేని కుటుంబ సభ్యులు నాగచైతన్య, సమంత, అల్లు అర్జున్‌లు సందడి చేశారు. మిగతా సినీ ప్రముఖులు ఇళ్ల నుంచే ప్రత్యక్షంగా వీక్షించారు. వధూవరులను అందరూ కలకాలం చల్లగా వర్ధిల్లాలని శుభాశ్శీస్సులు అందించారు. ప్రిన్స్ మహేశ్‌ బాబు, నాగశౌర్య, నాని, అనిల్‌ రావిపూడి ఇలా పలువురు నూతన జంటకు వర్చువల్ వీడియోలో శుభాకాంక్షలు తెలియజేశారు. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కూడా రానా, మిహీకాలకు అభినందనలు తెలిపారు.