ప్రముఖ యువ హీరో దగ్గుబాడి రానా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. స్టార్ కిడ్ అయినప్పటికీ తనదైన పెర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నాడు రానా. తాజాగా తన తొలి వెబ్ సీరీస్ రానా నాయుడు ప్రమోషన్లో బిజీ బిజీగా ఉంటున్నాడు రానా. ఈ వెబ్ సీరీస్‌లో బాబాయ్ వెంకటేశ్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుని బుల్లితెరను షేక్ చేస్తున్నాడు. తన వెబ్ సీరీస్ ప్రమోషన్స్‌లో దూసుకెళ్తున్న రానా తాజాగా మీడియాతో తాను ఎదుర్కొన్న అనేక రకాల ఆరోగ్య సమస్యల గురించి మాట్లాడాడు. తనకైన సర్జరీల గురించి చెప్పుకొచ్చాడు.
మీడియాతో రానా మాట్లాడుతూ” నా కుడి కన్ను సరిగా కనిపించదు. కిడ్నీ సమస్య కూడా ఉంది. వీటికి సర్జరీ అవసరం అని డాక్టర్లు సూచించారు. నేను సర్జరీకి వెళ్లాను. కార్నియా ట్రాన్స్ ప్లాంట్ గురించి మాట్లాడే అతి కొద్ది మంది వ్యక్తుల్లో నూను ఒకడిని. ఇప్పుడు సర్జరీలతో నేను టెర్మినేటర్‌ని అయ్యానని అనుకుంటున్నాను. నేను గమనించిన విషయం ఏమిటంటే చాలా మంది అనారోగ్య సమస్యలు ఎదురైనప్పుడు చాలా కుంగిపోతూ కనిపిస్తుంటారు. తరువాత ఈ సమస్యలు తీరినా ఇంకా వాటి గురించే ఆలోచిస్తుంటారు. ఆ ఆలోచనలతో అక్కడే ఉండిపోకూడదు. బయటకు వచ్చి జీవిత ప్రయాణాన్ని కొనసాగించాలి ” అని రానా తెలిపాడు.
ప్రయోగాత్మక సినిమాలు చేయడమంటే రానాకు చాలా ఇష్టం. రానా చేసే ప్రతి సినిమాలో కొత్తగా కనిపిస్తాడు. హీరోగానే కాదు ప్రతినాయకుడి ప్రాతలోనూ మెప్పించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు రానా. కేవలం హీరోగా మాత్రమే ఎదగాలనుకోలేదు రానా. నటుడిగా తనలోని అన్ని వేరియేషన్స్‌ను చూపిస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సృష్టించుకున్నాడు. లీడర్లో కూల్ క్యారెక్టర్‌తో తెలుగు తెరకు పరిచయమైన రానా బాహుబలిలో తనలోని విలన్‌ను చూపించాడు. సినిమాలే కాదు తాజాగా మొదటిసారిగా వెబ్ సీరీస్‌లోనూ నటిస్తూ ఇండియన్ వైడ్ క్రేజ్‌ను పెంచేసుకుంటున్నాడు. ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన రానా నాయుడు వెబ్ సీరీస్‌కు మిశ్రమ స్పందన లభిస్తోంది. బాబాయ్ అబ్బాయిలు ఇద్దరూ ఇరగదీస్తున్నారు.