విమానంలో లగేజీ మిస్.. రానా ఆన్ ఫైర్.. - MicTv.in - Telugu News
mictv telugu

విమానంలో లగేజీ మిస్.. రానా ఆన్ ఫైర్..

December 4, 2022

టాలీవుడ్ స్టార్ హీరో రానాకు చేదు అనుభవం ఎదురైంది. ఇండిగో సర్వీస్‌ నిర్లక్ష్యం కారణంగా హీరో రానా లగేజీ మిస్సైంది. ఈ ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి రానా హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లేందుకు ఎయిర్ పోర్టుకు వచ్చారు. అయితే షెడ్యూల్డ్ ఫ్లయిట్ కాకుండా మరో విమానంలో వెళ్లాలని సిబ్బంది సూచించారు. లగేజి కూడా అదే విమానంలో వస్తుందని తెలిపారు. వారు చెప్పినట్టే రానా కుటుంబం బెంగళూరు వెళ్లింది. కానీ లగేజి మాత్రం రాలేదు. దీంతో

ఇండిగో సర్వీస్‌పై రానా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విమానాశ్రయ సిబ్బందితో పాటు ఉన్నతాధికారులనుంచి కూడా సరైనా స్పందన రాకపోవడంతో రానా అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్వీట్‌ను చేసి ఇండిగో ఒక వరస్ట్ సర్వీస్ అంటూ తిట్టిపారేశారు

. టైమింగ్స్, లగేజీ ట్రాకింగ్ సరిగా లేవని మండిపడ్డాడు. గతంలోనూ ఇండిగో సర్వీస్‌పై అనేక ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అయినా ఆ సర్వీస్ తీరు మారడం లేదంటూ పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.