Rana Lip Lock in Rana Naidu Become Hot Topic In Social Media
mictv telugu

పెళ్లి తర్వాత ఈ ముద్దులేంటీ.. రానా?

September 26, 2022

Rana Lip Lock in Rana Naidu Become Hot Topic In Social Media

దగ్గుబాటి హీరోలు వెంకటేశ్‌, రానా ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌ సిరీస్‌ ‘రానా నాయుడు’ . యాక్షన్‌, క్రైమ్‌ నేపథ్యంలో సిద్ధమైన ఈ సిరీస్‌లో వీరిద్దరూ తండ్రీ కొడుకులుగా నటించారు. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఇది త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో ‘రానా నాయుడు’ టీజర్‌ను నెట్‌ఫ్లిక్స్‌ తాజాగా షేర్‌ చేసింది. అమెరిక‌న్ క్రైమ్ డ్రామా సిరీస్ రే డోనోవ‌న్ ఆధారంగా తెరకెక్కిన ఈ వెబ్‌ సిరీస్‌ కోసం దగ్గుబాటి ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సిరీస్‌కు క‌ర‌న్ హ‌న్షుమాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. దీనికి సంబంధించిన టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. త్వరలోనే నెట్ ఫిక్స్ లో ఇది స్ట్రీమింగ్ కానుంది .

అయితే ఈ వెబ్ సిరీస్‌లో హీరో వెంకటేష్ లుక్ చాలా డిఫరెంట్‌గా ఉంది. జుట్టు, గడ్డం నెరిసి ఉన్న వెంకీ ఓల్డ్ లుక్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది.ఇక రానా నాయుడు వెబ్ సిరీస్ లో రానా దగ్గుబాటి హద్దులు మీరి బోల్డ్ సీన్స్‌లో నటించినట్టు టీజర్ చూస్తుంటేనే తెలిసిపోతోంది. హట్ హాట్ గా లిప్ కిస్సులతో రెచ్చిపోవడం టీజర్ లో స్పష్టంగా కనిపించింది. అయితే నిజానికి రానా దగ్గుబాటి లిప్ కిస్సులకి ,బెడ్ సీన్లకి ,బోల్డ్ సన్నివేశాలకి దూరంగా ఉంటున్నాడు. కానీ ఇక్కడ మాత్రం కంటెంట్‌లో భాగంగానే కథ డిమాండ్ చేయడంతో రానా అలా చేశారని తెలుస్తుంది. ఏది ఏమైనా సోషల్ మీడియాలో ఈ న్యూస్ తెగ వైరల్ అవుతుంది. రానా తన సినిమాల విషయంలో కాస్త స్లో అయ్యాడు. ఇక వెంకీ మాత్రం రానా నాయుడు షూటింగ్ అయిపోవడంతో.. నెక్ట్స్ దృశ్యం3 షూటింగ్ కు రెడీ అవుతున్నాడు.